spot_img
Monday, July 21, 2025
spot_img

అందమే పెట్టుబడి.. సంపన్నవర్గాలే టార్గెట్‌. హనీ ట్రాప్ తో అడ్డంగా బుక్ చేస్తున్నారు

వలపు మాటలతో స్కిన్ షో చేస్తుంది.. ఆ టైమ్‌లో ఎదుటివ్యక్తి టెంప్ట్ అయ్యాడా.. అంతే సంగతులు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఒక్కసారి స్కెచ్ వేశారంటే టార్గెట్ ని ఈజీగా రీచ్ అవుతారు దొంగలు ప్రొఫెషన్స్ అయితే వలపులు వయ్యారాలతో ఎదురు వాళ్ళని లొంగ తీసుకోవడం వీళ్ళ ప్రొఫెషన్.. ఇలా వలపుల వయ్యారాలతో మాయ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులిస్తావా..? పరువు బజారుకీడ్చాలా? అంటూ పచ్చనోట్లు డిమాండ్ చేస్తారు. ఇదే తరహాలో హానీట్రాప్‌లో పడ్డ ఓ బాధితుడు విశాఖ పోలీసులను ఆశ్రయించడంతో.. కిలాడీ గ్యాంగ్‌ బండారం బయటపడింది.

విశాఖలో మరో హానీ ట్రాప్‌ దందా బయటపడింది. ఓ సంపన్న ఎన్నారై యువకుడిని టార్గెట్‌ చేసిన యువతి.. సోషల్‌మీడియాలో అతడితో పరిచయం పెంచుకుంది. పక్కాగా ప్లాన్‌ చేసి బాధితుడిని విశాఖ రప్పించింది. తమ ముఠా సభ్యులతో అతడిని బంధించి మత్తు పదార్ధాలు అందించింది. ఆపై అతడితో ఏకాంతంగా గడిపిన వీడియోలు షూట్‌ చేయించింది. పెళ్లి చేసుకోకపోతే కేసు పెడతానంటూ నిందితురాలు బెదిరింపులకు దిగడంతో విశాఖ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..నిందితురాలు కొరుప్రోలు జాయ్ జెమిమాను అదుపులోకి తీసుకున్నారు.జాయ్ జెమీమా అనే మహిళ.. యువకులను ట్రాప్ చేస్తుందని విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వెల్లడించారు. ఓ ముఠాగా ఏర్పడి ఇలాంటి ట్రాప్స్‌కి పాల్పడుతున్నారని తెలిపారు. నిందితురాలు జాయ్ జెమీమాకు కూడా శిక్షణ తీసుకుందన్నారు. యువకులను ఎలా ట్రాప్ చేయాలి, ఎలా మత్తు ప్రయోగించాలి, వీడియోలు తీసి ఎలా బ్లాక్ మెయిల్ చేయాలని శిక్షణ పొందినట్లు గుర్తించామన్నారు సీపీ. దీని వెనుక ఇంకా ఎవరున్నారో తెలుసుకునే పనిలో ఉన్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ హానీట్రాప్ వెనుక పెద్దముఠా ఉందని గుర్తించారు పోలీసులు. ముందుగా ఈ ముఠా డబ్బున్న ఓ బకారాను సెలక్ట్‌ చేసుకుంటారు. ఆపై తమ గ్యాంగ్‌ నుంచి అమ్మాయిని ఉసిగొల్లపుతారు. ఆపై అసలు కథ నడిపిస్తారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించగా.. మరింతమంది బాధితులు ఉండే అవకాశం ఉందంటున్నారు. పోలీసులు. ఈ ముఠా చేతిలో మోసపోయిన వాళ్లు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు..విశాఖ సీపీ.

ఈ మధ్య తరుచు హనీట్రాప్‌ అనే పేరు వినిపిస్తోంది. మొదట అమాయకుల్ని అందచందాలతో తమ వైపు లాక్కోవడం.. ఆపై వాళ్ల న్యూడ్‌ వీడియోలు రికార్డ్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయడం కామన్‌గా మారిపోయింది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో కొందరు వారు అడిగినంతు ముట్టచెబుతుండగా మరికొందరు ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే ఇలాంటి యవ్వారాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular