అక్రమంగా ఇసుకను రవాణాను అడ్డుకున్నందుకు ఏకంగా రెవెన్యూ శాఖ అధికారినే హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని శాహాదోల్ జిల్లాలో సోన్ నది సమీపంలో అక్రమంగా ఇసుకను తవ్వి రావాణా చేస్తున్న ట్రాక్టర్ను ప్రభుత్వాధికారి పట్వారీ ప్రసన్ సింగ్, తన సహోద్యోగులతో కలిసి అడ్డగించారు.అయితే, ఇసుక ముఠా అధికారులను లెక్కజేయకపోవడమే కాకుండా ఓ డ్రైవర్ పట్వారీ సింగ్పైకి ట్రాక్టర్ను ఎక్కించాడు.
ఈ ఘటనలో ప్రభుత్వాధికారి అక్కడికక్కడే మృతి చెందగా, నిందితుడు వాహనంతో పాటు అక్కడినుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆదివారం ఉదయం వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. డ్రైవర్ సంఘటన జరిగిన ప్రాంతానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైహార్ జిల్లాకు చెందిన శుభం విశ్వకర్మ(25)గా గుర్తించారు. అతనిపై హత్య కేసు నమోదు చేసినట్టు శాహాదోల్ ఎస్పీ కుమార్ ప్రతీక్ చెప్పారు. ట్రాక్టర్ను సీజ్ చేసి యజమానిని గుర్తించినట్టు పేర్కొన్నారు.
అక్రమ ఇసుక రవాణా.. అడ్డుకున్నందుకు ప్రభుత్వాధికారి హత్య
RELATED ARTICLES




