spot_img
Tuesday, March 24, 2026
spot_img

అక్షయ విద్యా ఫౌండేషన్ సందర్శించి వివరాలు తెలుసు కున్న జయప్రకాష్ నారాయణ

బాల్యం ఒక మధురమైన జ్ఞాపకం ఎవరికైనా కానీ కొంతమందికి అవకాశాలు లేకపోవడం వల్ల వారి యొక్క బాల్యం బాధాకరంగా అస్తవ్యస్తంగా చేదు జ్ఞాపకాలతో ముగుస్తుంది. ఈ సమాజం అందరికీ ఒకే రకమైనటువంటి వ్యత్యాసాలు లేనటువంటి అవకాశం ఇచ్చింది, అదే జనన మరణాలు ఇక్కడ అతి సామాన్యుడి నుంచి దేశాధినేత ప్రపంచాదినేత ఎవరైనా ఒకటే. మనిషి పుట్టుకలోనే పోరాటం…
తెలుసుకోవాలనే ఆరాటం… అన్వేక్షణ, రాతియుగం నుండి రాకెట్ సైన్స్ వరకు ఆవిష్కరణలన్ని మనిషి సాధించినవే.
అక్షయ విద్యా ఫౌండేషన్ ఒక వ్యక్తి గనుక చదువుకుంటే మూడు తరాల తలరాతలు మారుతాయి అనే సిద్ధాంతం మీద ఆ సంస్థ పనిచేస్తుందని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది
అద్భుత ఆవిష్కరణలు, సాంకేతిక విశ్లేషణలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్థిక వనరులతోనే జరుగుతాయని కాదు, ఆలోచన విధానంతోనే అవి ఆవిష్కృతం అవుతాయి.
నాటి రాతియుగం నుండి నేటి సాంకేతియుగం వరకు మహిళల పాత్ర కుటుంబంలో, సమాజంలో దేశానికి గొప్ప ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులను, నాయకులను అందించడంలో మహిళలు ముఖ్యపాత్రను పోషించారు.
భారతదేశ రాష్ట్రపతి ఒక మహిళా, మన రాష్ట్ర గవర్నర్ ఒక మహిళనే సాధించాలనేటటువంటి బలమైన కోరిక ఉంటే ఆకాశమే హద్దు అనే విధంగా మనం ఎదగాలి, అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు మున్ముందు కూడా మహిళలు ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి.
గత 12 సంవత్సరాలుగా
అక్షయవిద్య ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి కేంద్రాలను అమ్మాయి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు తను నివసించేటటువంటి ప్రాంతంలో 25 మంది చిన్నారి నిరుపేద పిల్లలకి ఉచిత విద్యను అందిస్తుంది. అలాగే తను కూడా చదువుకుంటూ, ఉన్నతంగా ఎదగడం కోసం సంస్థ నిర్వహించేటటువంటి దసరా, నెలవారీ, వేసవి సెలవుల్లో శిక్షణ శిబిరాలకు హాజరవుతూ అక్కడ ఆటలు పాటలు సాంకేతిక విద్యను గుడ్ టచ్ బాడ్ టచ్ ఏ విధంగా సమాజంలో మేలగాలి సెల్ఫ్ డిఫెన్స్ వ్యక్తిత్వ వికాసం తరగతులకు హాజరయ్యి నేర్చుకుంటారని తెలుసుకొని చాలా ఆనందించాను.
అక్షయ విద్యా ఫౌండేషన్
సాధించిన కొన్ని విజయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి.
1.400 విద్యార్థులను గురుకులాలకు పంపడం

  1. గూగుల్, విప్రో, టిసిఎస్, పోస్టల్ డిపార్ట్మెంట్ వంటి ఉన్నతమైనటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం
  2. రోజూవారి కూలి కొడుకు ఐఐటీ ఖరగ్పూర్ లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించడం
  3. బస్తీలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం, కుల వివక్షత లేకుండా చూడాలని అందరితో కలిసి పిల్లల మధ్య సామూహిక భోజనం ఆగస్టు 15, జనవరి 26 రోజులలో దేశ నాయకుల వేషధారణతో స్థానిక బస్తీల్లో తిరగడం జాతీయ భావాలు నింపడం.
  4. విద్యలో ప్రతిభ ఘనపరిచిన పేద విద్యార్థులను ఉన్నత చదువుల కొరకు స్కాలర్షిప్ నివ్వడం పలు సంస్థలతో కలిసి పనిచేయడం
  5. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మేమున్నామని సమస్త ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం కోవిడ్ సమయంలో 3,30,000 వేల మందికి పైగా ఆహారానందించడం, ఆహార ధాన్యాలు అందించడం,
    మరెన్నో సేవా కార్యక్రమాలు సంస్థ చేపట్టింది అని తెలుసుకున్నాను
    ఎదిగిన వారు… ఎదిగిన నట్లు గా… ఎవరికి అందని అంత ఎత్తుకు ఎగిరిపోయి…
    తమ ఎదుగుదలకు కారణమైన మూలాన్ని మరచిపోయిన పాపమే నేటి పేదరికానికి శాపం.
    చదువు కోనుక్కోలేని అణగారిన బిడ్డల అక్షర ఆకాంక్షలను నెరవేరుద్దాం. చదువే అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని ఇస్తుంది.
    బడుగు బిడ్డలు చదివే సమాజంలో సామరస్య సమానత్వం వికసిస్తుంది పేద బిడ్డలను విద్యలో బలోపేతం చేస్తేనే చైతన్య భారత్ నిర్మాణం నిర్మానమవుతుంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular