spot_img
Wednesday, March 25, 2026
spot_img

అఖిల్ పహిల్వాన్ సెక్స్ రాకెట్ కేసులో సంచలన విషయాలు.. ఆ సెలబ్రెటీలకు అమ్మాయిల సప్లై..?

అబిడ్స్‌లో వెలుగు చూసిన సెక్స్ రాకెట్‌లో సంచలన విషయాలు బయపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన అఖిల్ పహిల్వాన్‌కు టాలీవుడ్‌తో పాటు బుల్లితెరకు చెందిన పలువురు సెలబ్రెటీలతో సన్నిహిత పరిచయాలు ఉన్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ క్రమంలో అఖిల్పహిల్వాన్ టాలీవుడ్, బుల్లితెరకు చెందిన వారికి కూడా యువతులను సరఫరా చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులతో మాట్లాడగా ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతామని చెప్పటం గమనార్హం.

రాంనగర్ ప్రాంతానికి చెందిన అఖిల్పహిల్వాన్ తన స్నేహితుడైన రఘుపతితో కలిసి కొంతకాలంగా హైదరాబాద్‌లో సెక్స్రాకెట్ నడుపుతున్నాడు. వెస్ట్బెంగాల్‌కు చెందిన నిరుపేద కుటుంబాల్లోని యువతులను ఆన్లైన్ ద్వారా సంప్రదించి హైదరాబాద్ వచ్చి తాము చెప్పినట్టుగా చేస్తే రోజుకు 15 నుంచి 25వేల రూపాయలు సంపాదించుకోవచ్చని ఉచ్ఛులోకి లాగేవాడు. బస, ఇతరత్రా ఏర్పాట్లు తానే చేస్తానని చెప్పేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్నుంచి పదహారు మంది యువతులు హైదరాబాద్ వచ్చారు.

వీరందరినీ అఖిల్పహిల్వాన్అ బిడ్స్‌లోని ఫార్చూన్ లాడ్జీలో బస చేయించాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే లాడ్జీలో 25 గదులు ఉండగా 16 గదులను అఖిల్పహిల్వాన్ బుక్ చేయటం. ఎలాంటి ఆధార పత్రాలు లేకుండానే

యువతులకు బస కల్పించటం. ఇలా లాడ్జీలో దిగిన యువతుల వద్దకు అఖిల్పహిల్వాన్ అతని సహచరుడు రఘుపతి కస్టమర్లను పంపిస్తూ వ్యభిచారం జరిపిస్తున్నారు. ఈ మేరకు పక్కాగా సమాచారం అందటంతో లాడ్జీపై దాడి జరిపిన పోలీసులు 16మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ఓ యువతి ముంబాయి నుంచి ఇక్కడికి వచ్చింది. విచారణలో వీళ్లు వెల్లడించిన వివరాల నేపథ్యంలో పోలీసులు ఈ రాకెట్ నడుపుతున్న అఖిల్పహిల్వాన్, రఘుపతిలను అరెస్టు చేశారు. దాంతోపాటు కస్టమర్లయిన అభిషేక్భాటి, కేశవ్వ్యాస్, అబ్దుల్ఖలీద్, సంతోష్‌లను కూడా అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న యువతులను రిహాబిలేషన్ సెంటర్‌కు తరలించారు. నిందితుల నుంచి 22 సెల్ఫోన్లు సీజ్ చేశారు.

అఖిల్పహిల్వాన్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌లోని వివరాలను విశ్లేషించగా టాలీవుడ్, బుల్లితెరకు చెందిన పలువురు నటీనటుల నెంబర్లు ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. దాంతోపాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు యువతుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో అఖిల్పహిల్వాన్ టాలీవుడ్, బుల్లితెరకు చెందిన నటులకు కూడా యువతులను సప్లై చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీనిపై అబిడ్స్ ఇన్స్పెక్టర్ నర్సింహ రాజుతో మాట్లాడగా ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో అఖిల్పహిల్వాన్ టాలీవుడ్, బుల్లితెర నటులకు అమ్మాయిలను సప్లై చేసినట్టుగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదన్నారు. అయితే, అతని సెల్ఫోన్లో పలువురు సెలబ్రెటీల నెంబర్లు ఉన్నట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో వెలుగు చూసిన సెక్స్రాకెట్‌తో ఎవరైనా నటులకు సంబంధాలు ఉన్నాయా?, అఖిల్పహిల్వాన్ ద్వారా ఎవరైనా నటులు యువతులను పిలిపించుకున్నారా? అన్న కోణాల్లో విచారణ చేస్తున్నట్టు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular