అత్తా అంటే అజమాయిషీ..తాను చెప్పింది వినాలి అని ప్రతి అత్త అనుకుంటుంది..అబ్బ అయితే ఏదన్న కొత్త గా చెప్పండి ఇది తెలిసిందే కదా అని మిరు అనుకోవచ్చు ..ఈ రియల్ క్రైమ్ కాహనిలో అదే అసలు ట్విస్ట్ ..అయితే ఆలస్యం దేనికి వివరాల్లోకి వెళతే
క ఉత్తరప్రదేశ్.. ఆగ్రాలో జరిగింది. చీరలంటేనే చిరాకుపడే అత్త… రోజూ జీన్స్ ధరిస్తూ.. మోడ్రన్ లుక్‌లో కనిపిస్తోంది.తన కోడలు కూడా అలాగే చెయ్యాలనేది ఆమె ఆలోచన. ఐతే.. కోడలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఆమెకు జీన్స్ వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఆమె చీరలు మాత్రమే ధరిస్తా అంటోంది.ఇలాంటి మోడరన్ అత్తను చూసారా ఎప్పుడైనా ఒక్కడే అసలు ట్విస్ట్ ఇలా ఇద్దరూ విరుద్ధమైన భావాలతో ఉన్నారు. పైగా అత్తా-కోడలు కదా.. ఈ గొడవకు బ్రేక్ పడలేదు. రోజూ అత్తతో పోరు భరించలేకపోయిన కోడలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
హరిపర్వత్‌కి చెందిన ఓ యువకుడికి.. ఎత్మాద్‌పుర్‌కి చెందిన యువతితో సంవత్సరం కిందట పెళ్లైంది. పెళ్లి సమయంలోనే జీన్స్ వేసుకోవాలని కోడలిని కోరినా.. పెళ్లి సంప్రదాయం ప్రకారం జరగాలనే ఉద్దేశంతో.. కోడలు శారీ ధరించితే.. అత్త ఊరుకుంది. ఆ తర్వాతి రోజు నుంచే గొడవ మొదలైంది. అప్పటి నుంచి అది కంటిన్యూ అయ్యింది. చివరకు ఈ పంచాయతీ ఆగ్రా పోలీస్ స్టేషన్‌కి చేరింది.
ఈ కేసులో అత్త ఆగ్రా సిటీకి చెందినది. కోడలేమో గ్రామానికి చెందినది. అందువల్ల ఆమెకు చీరలు ధరించడమే ఇష్టం. పెద్ద సమస్య ఏంటంటే.. ఆమె భర్త కూడా ఆమెకు సపోర్ట్ ఇవ్వట్లేదు. జీన్స్ వేసుకోవడానికి నీకేంటి ఇబ్బంది అని ప్రశ్నిస్తున్నాడు. భర్త, అత్త ఒక్కటవ్వడంతో.. ఒంటరైన ఆమె.. పోలీసులే తనను కాపాడాలంటోంది. రివర్సులో ఉన్న ఈ కేసును ఎలా సెటిల్ చెయ్యాలో పోలీసులకు అర్థం కావట్లేదు. రెండువైపులా కౌన్సెలింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. మరి కౌన్సెలింగ్ తర్వాతైనా.. అత్తపోరు ఆగుతుంతో లేదో.ఇద్దరి సంగతి సరే పొక చెక్కల్లో కర్ర లాగా మధ్య లో ఆ యువతి బర్త తన తల్లికే సపోర్ట్ చేస్తున్నాడు ..యువతి మామ..అత్త భర్త కొడలికే సపోర్ట్ చేస్తున్నడు తన కోడలు సాంప్రదాయ పద్ధతిలో ఉంటుంది దీనిలో తప్పేముంది అని..పాపం పోలీసులు ఇద్దరికీ చెప్పలేక తలలు పట్టుకున్నారు