spot_img
Monday, March 23, 2026
spot_img

అనుమానాస్పద ప్రముఖ నటుడు కారులో శవమై తేలాడు

మలయాళ నటుడు వినోద్ థామస్ (47) అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ లో ప్రత్యేక పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు.ఏమైందో ఏమో కారులో శవమై కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

రాత్రి కేరళలోని కొట్టాయం జిల్లా బంబడి ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ పార్కింగ్ వద్ద ఒక కారు అనుమానాస్పదంగా ఆగి ఉంది. గమనించిన హోటల్‌ సిబ్బంది వెళ్లి చూడగా.. మృత దేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని మలయాళ నటుడు వినోద్ థామస్ గా గుర్తించారు. వినోద్ థామస్ మరణవార్తతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular