spot_img
Monday, September 29, 2025
spot_img

అఫిడవిట్‌ ఇవ్వాలి లేదంటే క్షమాపణలు చెప్పాలి.. రాహుల్‌ గాంధీకి సీఈసీ అల్టిమేటం..!

కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఎదురుదాడి చేశారు. రాహుల్‌ ఆరోపణలను తోసిపుచ్చారు.బిహార్‌ ‘సర్‌’ అంశంపై ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన గణాంకాలు లేని పీపీటీని చూపించినంత మాత్రాన అబద్ధం నిజం కాదని.. ఆధారాలు అందించాల్సి ఉంటుందన్నారు. రాహుల్‌పై ఎదురుదాడి చేస్తూ అఫిడవిట్‌ ఇవ్వాలని.. లేదంటే దేశానికి క్షమాపణలు చెప్పాలని.. ఇందులో మూడో మార్గం లేదని హెచ్చరించారు. ఏడురోజుల్లో అఫిడవిట్‌ ఇవ్వకపోతే ఆరోపణలు నిరాధారంగా పరిగణిస్తామన్నారు. బిహార్‌ ‘సర్‌’ అంశంపై కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుంటుందని.. ప్రతి ఎన్నికలకు ముందు ఓటరు జాబితా సరి చేయాలని ప్రజాప్రాతినిధ్య చట్టం చెబుతోందని.. ఇది ఎన్నికల కమిషన్‌ చట్టపరమైన బాధ్యత అన్నారు. సర్‌ అంశానికి సంబంధించి పని జూన్‌ 24న ప్రారంభమై.. జులై 20 నాటికి దాదాపు పూర్తయ్యిందని తెలిపారు.

ఈ సందర్భంగా రెండు ఎపిక్‌ కార్డులు ఉన్న ఓటరు కార్డుల అంశంపై సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. డూప్లికేట్‌ ఎపిక్‌ రెండు విధాలుగా ఉండవచ్చని.. ఒకటి పశ్చిమ బెంగాల్‌ ఉన్న వ్యక్తికి.. వేరే వ్యక్తికి ఒక ఎపిక్‌ నెంబర్‌ ఉంటుందని.. హర్యానాలో ఉన్న మరొక వ్యక్తికి ఒకే ఎపిక్‌ నెంబర్‌ ఉంటుందన్నారు. దీనిపై ప్రశ్న మార్చి 2025 సమయంలోనే వచ్చినా దాని చర్చించి.. దేశవ్యాప్తంగా సమస్యను పరిష్కరించామన్నారు. ఎపిక్‌ నంబర్లు ఒకేలా ఉన్న దాదాపు మూడు లక్షల మంది వ్యక్తులను గుర్తించారని.. కాబట్టి వారి ఎపిక్‌ నంబర్లు మార్చినట్లు పేర్కొన్నారు. ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు జాబితాలో ఉంటే.. అతని ఎపిక్‌ నంబర్‌ భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందన్నారు. ఒక వ్యక్తి అనేక ఎపిక్‌లు.. 2003కి ముందు ఎన్నికల కమిషన్‌ వద్ద డేటా ఒకేచోట ఉండే వెబ్‌సైట్‌ లేదని చెప్పారు. 2003 కి ముందు సాంకేతికంగా సౌకర్యం అందుబాటులో లేనందున.. వేర్వేరు ప్రదేశాలకు వెళ్లిన చాలా మంది వ్యక్తుల పేర్లను ఆయా ప్రాంతాల్లో జాబితాలో చేర్చారని.. అప్పుడు ప్రశ్నలు వచ్చాయని.. నేడు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉందని.. దాన్ని తొలగించవచ్చన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular