spot_img
Monday, July 21, 2025
spot_img

అమర్ భార్య తేజుకి టార్చర్, అలాంటి ఫోటోలు వైరల్ చేస్తూ. దారుణాలు బయటపెట్టిన సీరియల్ నటుడు

బిగ్ బాస్ హౌస్ లో పది వారాల క్రితం ఉన్న అమర్ దీప్ ఒక లెక్క .. ఇప్పుడు ఆడుతున్న అమర్ ఇంకో లెక్క అన్నట్టుగా మారిపోయాడు. మొదట్లో విపరీతమైన ట్రోలింగ్ కి గురైయ్యాడు అమర్ దీప్

హౌస్ లో ఉన్న అమర్ తో పాటు అతని భార్య తేజస్విని కి బయట నరకం చూపించారు. అయితే అమర్ దీప్ ని సపోర్ట్ చేస్తూ వస్తున్న జానకి కలగనలేదు సీరియల్ నటుడు నరేష్ లొల్ల.. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

కాగా సోషల్ మీడియా నుంచి తేజస్విని ఎదుర్కొంటున్న ట్రోల్స్ పై స్పందిస్తూ .. షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నరేష్ లొల్ల .. అమర్ ను అతని ఫ్యామిలీ ని కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై నేను సైబర్ క్రైమ్ కి కూడా వెళ్ళాను. నేను గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో వాళ్లే ఎకౌంట్లు క్లోజ్ చేసుకున్నారు. సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయడంతో దాదాపు 300 ఎకౌంట్లు క్లోజ్ చేయించాను.

నేను అబ్బాయిని కాబట్టి ఫైట్ చేయగలిగాను. కానీ అమ్మాయిలు అలా కాదు. అమర్ కి సపోర్ట్ చేస్తూ ఓ అమ్మాయి పోస్ట్ పెట్టిందని .. ఆమె గురించి దారుణంగా కామెంట్లు పెట్టి హింసించారు. ఇప్పటివరకు చాలా మంది బిగ్ బాస్ కు వెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. కానీ తేజు అంత ఇబ్బంది ఎవరు పడలేదు. ఈ విషయం నేను ఇంతవరకు చెప్పలేదు. అసలు చెప్పొచో లేదో కూడా తెలియదు.

తేజు ఫోటోలు మార్ఫింగ్ చేశారు. అసభ్యకరమైన బాడీ లకు ఆమె ఫేస్ పెట్టి .. తననే ట్యాగ్ చేశారు. ఆ విషయం తేజు నాతో చెప్పలేదు .. నేనే చూసి కంప్లైంట్ చేశాను. ఆ అకౌంట్ డిలీట్ చేయించా. తేజు ను ఎంతలా టార్చర్ చేశారంటే యూట్యూబ్ లో అమర్ కి సపోర్ట్ గా ఏదైనా వీడియొ పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఏమైనా పెడదాం అంటే ట్రోల్స్ చేస్తున్నారని భయపడుతుంది. అందుకే అమర్ కి సపోర్ట్ చేయడం లేదు .. అంతే తప్ప కావాలని చేయలేదు అనేది అబద్ధం. ఆమె షూట్ లో ఉన్న ఫోన్ లో షో చూస్తూనే ఉంటుంది. అమర్ గురించే ఎప్పుడు ఆలోచిస్తుంది. దయ చేసి ఇకనైనా ట్రోల్ చేయడం ఆపేయండి అంటూ చెప్పుకొచ్చాడు నరేష్ లొల్ల

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular