spot_img
Monday, July 21, 2025
spot_img

అమెరికాలో 7.25 లక్షల మంది భారతీయులు అక్రమ వలసదారులే.. వెలుగులోకి సంచలన నివేదిక

అమెరికాలో ( America )అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. కొద్దినెలల క్రితం అమెరికా- కెనడా( America – Canada ) సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది. ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.

ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.

తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో దాదాపు 7,25,000 మంది భారతీయ అక్రమ వలసదారులు వున్నారు. ” new Pew Research Centre ” అంచనాల ప్రకారం.. అమెరికాలో మెక్సికో , ఎల్ సాల్వడార్ ( Mexico, El Salvador )తర్వాత అనధికార వలసదారులలో మూడవ అతిపెద్ద జనాభా భారతీయులదే.

2021 నాటికి అమెరికాలో 10.5 మిలియన్ల మంది అక్రమ వలసదారులు వుంటారని.. వీరి సంఖ్య ఆ దేశ మొత్తం జనాభాలో 22 శాతం వుంటుందని అధ్యయనం తెలిపింది. ప్రపంచంలోని దాదాపు ప్రతి ప్రాంతం నుంచి 2007 నుంచి 2021 వరకు అమెరికాలో అడుగుపెట్టే అక్రమ వలసదారుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. సెంట్రల్ అమెరికా (2,40,000), దక్షిణ, తూర్పు ఆసియా నుంచి (1,80,000) పెరుగుదల వుంది.మెక్సికో నుంచి అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల సంఖ్య 2021లో 4.1 మిలియన్లు కాగా.. ఎల్ సాల్వడార్ 8,00,000.. భారతీయులు 7,25,000 మంది వున్నట్లుగా నివేదిక తెలిపింది. అత్యధిక సంఖ్యలో అమెరికాలో అక్రమ వలసదారులు వున్న దేశాలలో భారత్, బ్రెజిల్, కెనడా, పూర్వపు సోవియట్ యూనియన్ దేశాలు 2017 నుంచి 2021 వరకు వృద్ధిని నమోదు చేశాయని నివేదిక వెల్లడించింది.

2021లో అతిపెద్ద అనధికార వలస జనాభా కలిగిన ఆరు రాష్ట్రాలు వరుసగా కాలిఫోర్నియా (1.9 మిలియన్లు), టెక్సాస్ (1.6 మిలియన్లు), ఫ్లోరిడా (900,000), న్యూయార్క్ (600,000), న్యూజెర్సీ (450,000), ఇల్లినాయిస్ (400,000). 2021లో ఇతర దేశాల నుంచి అనధికార వలసదారుల జనాభా 6.4 మిలియన్లు వుండగా.. 2017 నుంచి ఇది ఏకంగా 9,00,000 పెరిగిందని విశ్లేషకులు తెలిపారు. గ్వాటెమాల (7,00,000), హోండూరాస్ (5,25,000) మంది అమెరికాలో నివసిస్తున్నారు.

కొత్త ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనాల ప్రకారం 2021 నాటికి అమెరికాలో అనధికార వలస జనాభా 10.5 మిలియన్లకు చేరుకున్నాయి. ప్రపంచంలోని దాదాపు ప్రతి ప్రాంతం నుంచి అనధికార వలసదారుల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో అమెరికాలో చట్టబద్ధ వలసదారుల జనాభా 8 మిలియన్లకు పైగా చేరుకుంది.అని అఫిషియల్ గా పోలిస్ రికాడ్లు కూడా చెబుతున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular