బాత్రూంలో కొన్ని నెలలుగా ఆ యువతి వస్తువునొకదాన్ని చూస్తోంది. మనసులో ఎన్నో సందేహాలు మెదులుతున్నా ఎందుకోగానీ పట్టించుకోలేదు. ఇటీవల ఓ రోజు కుతూహలం తట్టుకోలేక ఆ వస్తువును ఫొటో తీసి తన తమ్ముడికి మెసేజీ పెట్టింది.
అతడిచ్చిన రిప్లై చూసి ఆమె నిర్ఘాంతపోయింది..మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైన్‌లో వెలుగు చూసిన పూర్తి వివరాల్లోకి వెళితే,
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైన్‌లో స్థానికంగా ఉన్న ఓ ల్యాబ్‌లో పని చేసే యువతి అక్కడికి సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే, కొన్ని నెలలుగా ఆమె తన బాత్రూంలో ఓ వింత వస్తువును చూస్తోంది. కానీ ఈ విషయాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. అయితే, ఇటీవల ఓ రోజు ఆమె కుతూహలం కొద్దీ ఆ వస్తువును ఫొటో తీసి తన సోదరుడికి పంపించింది. అదేంటో చెప్పమని అడిగింది.
అక్క పంపిన ఫొటోను చూసి షాకైన అతడు అది ఎక్కడ దొరికిందని ఆమెను ప్రశ్నించాడు. అది తన బాత్రూంలో ఉందని ఆమె చెప్పగానే అతడికి దిమ్మతిరిగినంత పనైంది. అది మైక్రో కెమెరా అని బాత్రూంలో ఎవరో పెట్టారని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆమెకు ఎప్పటి నుంచో ఇంటిఓనర్ కొడుకుపై అనుమానం ఉండటంతో ఆమె వెళ్లి అతడిని నిలదీసింది.
తొలుత అతడు బుకాయించేందుకు ప్రయత్నించాడు. అది కేవలం ఓ సెన్సార్ అని, ఆమెకు ఇబ్బందంటే తీసేస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో, బాధిత యువతి ఆగ్రహంతో అతడిపై మండిపడటంతో నిందితుడు ఆ కెమెరాను తొలగించాడు. ఈ క్రమంలో యువతి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాత్రూంలోని వైర్లు, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, నిందితుడి పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చాల్సి ఉంది.