spot_img
Monday, March 23, 2026
spot_img

అయోధ్య రామమందిరం పేరిట సైబర్‌ నేరగాళ్ల కొత్త మోసం .. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక

అయోధ్య రామమందిరం పేరును సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసాలకు ఉపయోగించుకుంటున్నట్లు తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) హెచ్చరించింది. అయోధ్య ప్రసాదం పంపిణీ పేరిట, విరాళాల సేకరణ పేరిట, వీఐపీ దర్శనం టికెట్ల విక్రయం పేరిట సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌లలో సందేశాలు పంపుతున్నట్లు పేర్కొంది. అయోధ్య రామమందిరం పేరుతో సైబర్‌ నేరస్తులు పంపే క్యూఆర్‌ కోడ్‌లు, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజ్‌ (ఏపీకే) ఫైల్స్‌ను నమ్మి మోసపోవద్దని టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్‌ షికా గోయల్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రామమందిరం పేరిట సైబర్‌ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చి నట్లు చెప్పారు. డబ్బు పంపాలంటూ వాట్సాప్‌ సందేశాల్లో నకిలీ లింక్‌లు పంపుతున్నారని, ఆ లింక్‌లు క్లిక్‌ చేసిన వారి నుంచి బ్యాంకుల వివరాలు, ఫోన్‌నంబర్లను సేకరిస్తున్నారని తెలిపారు. అలాగే వివిధ మొబైల్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసి ఓటీపీలు చెప్పాలని కోరుతున్నారని, అలా చేస్తే ఫోన్ల పనితీరు సైబర్‌ నేరగాళ్ల అ«దీనంలోకి వెళ్తుందని హెచ్చరించారు.ఈ డిజిటల్‌ ముప్పును ఎదుర్కోవడానికి వాట్సాప్‌ లేదా ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని షికా గోయల్‌ సూచించారు. ఈ తరహా మెసేజ్‌లు వస్తే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. అదేవిధంగా www. cybercrime. gov. in ద్వారా లేదా వాట్సాప్‌లో సైబర్‌ ఫ్రాడ్‌ రిజిస్ట్రీ నంబర్‌ 87126 72222కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular