ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం చట్టరీత్యా నేరం. హిందూ వివాహ చట్టం కూడా ఒప్పుకోదు ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత చట్టబద్ధంగా విడాకులు తీసుకుని.. అనంతరం మరో పెళ్లి చేసుకోవచ్చు.కానీ ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లిళ్లు చేసుకోవడం మన చట్టాలు అంగీకరించవు. అయితే బాంబే హైకోర్టు.. తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం పర్సనల్ చట్టాల ప్రకారం.. ఆ మతానికి చెందిన పురుషులు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చని బాంబే హైకోర్టు వెల్లడించింది. తాము చేసుకున్న మూడో పెళ్లికి మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఓ ముస్లిం వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా జడ్జి తీర్పు వెలువరించారు.
అలాంటి పురుషులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
RELATED ARTICLES