spot_img
Sunday, July 20, 2025
spot_img

అవే కొంపముంచాయా? కోలకత్తా సెన్సేషనల్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌!

కలకతాలోని టాంగ్రాలోని నాలుగు అంతస్తుల భవనంలో ఒకే కుటుంబంలో ఒక మైనర్ బాలికతో సహా ముగ్గురు మహిళల హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కోల్‌కతా పోలీసులు ఆ కుటుంబం భారీ అప్పులు చేసిందని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీవిలాసవంతమైన జీవనశైలిని వీడలేదు.ఈ కారణంగానే భార్యల్ని హత్యచేసి, ఆ తరువాత ఆత్మహత్యా యత్నం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు హత్యలు జరిగిన రోజు ఇంట్లోని సీసీటీవీలను కూడా ఆఫ్‌ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు.

ప్రణయ్ డే , ప్రసున్‌ డే కుటుంబాలు విలాసవంతమైన జీవితానికి అలువాటుపడి అప్పుల పాలైపోయారు. అయినా ఇద్దరు సోదరులు తమ విలాసవంతమైన జీవనశైలిని వీడలేదు. దీనివల్ల అప్పులు మరింత పెరిగాయి. తోలు వస్తువుల వ్యాపారం చేసే వీరికి భారీ అప్పులు చేసిందని, అందుకే ఇద్దరు సోదరులు ఈ చర్యకు పాల్పడి ఉండవవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర పోలీసు వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబానికి చెందిన కొంతమంది సన్నిహితుల విచారణలో ఈ విషయాలు తేలాయని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular