ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ప్రజలు విపరీతంగా వినియోగిస్తున్నారు. ఏ ప్రశ్న అడిగినా లేదనకుండా సమాధానం చెబుతుండటంతో..విద్యార్థుల నుంచి వృత్తి నిపుణుల వరకూ ఎంతోమంది వినియోగిస్తున్నారు. అయితే తాజాగా అమెరికాకు చెందిన ఆడమ్ రైన్ అనే యువకుడు(16) ఆత్మహత్య ఎలా చేసుకోవాలని చాట్ జీపీటీ (ChatGPT)ని సలహా అడిగి మరీ.. సూసైడ్‌కు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో తమ కుమారుడికి ఆత్మహత్యకు సంబంధించి సలహాలు ఇచ్చిందని ఆరోపిస్తూ.. మృతుడి తల్లిదండ్రులు ఓపెన్‌ఏఐ (Open AI), దాని సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman)పై దావా వేశారు. అందులో తమ కుమారుడు నెలలతరబడి చాట్‌జీపీటీతో ఆత్మహత్య గురించి చర్చించిన తర్వాత అది ఇచ్చిన సలహా ప్రకారం ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు పేర్కొన్నారు.
ఆత్మహత్య ఎలా చేసుకోవాలని రైన్ చాట్‌బాట్‌ను పలుమార్లు ప్రశ్నించగా అందుకు ఉన్న అవకాశాలు, పద్ధతుల గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇచ్చిందని బాధితులు దావాలో పేర్కొన్నారు. సూసైడ్ నోట్‌ను రాయడానికి కూడా సహకరించినట్లు తెలిపారు. ఇకనైనా చాట్‌జీపీటీలో స్వీయ-హాని పద్ధతుల కోసం వెతికిన సమయంలో అటువంటి సమాచారాన్ని అందివ్వకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఓపెన్ ఏఐ ప్రతినిధి స్పందిస్తూ.. రైన్ మరణం తమను ఎంతో బాధించిందని అన్నారు. ఇటువంటి సలహాలు అడిగినప్పుడు చాట్‌జీపీటీ వినియోగదారులకు పలు హెల్ప్‌లైన్ నెంబర్లను సైతం సూచిస్తుందని తెలిపారు. ఓపెన్ ఏఐ రక్షణ చర్యలను మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు.2022లో ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ (ChatGPT)ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తూనే ఉంది. నిత్యం కోట్ల మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కంపెనీ కూడా ఈ చాట్‌బాట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. అయితే చాట్‌జీపీటీని ఎక్కువగా నమ్మకూడదని ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (OpenAI CEO Sam Altman) పలుమార్లు ప్రజలను హెచ్చరించారు. దాంతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని కూడా పంచుకోకూడదని అన్నారు
ఆత్మహత్య కోసం.. చాట్ జీపీటీని సలహా అడిగి మరీ..
RELATED ARTICLES