spot_img
Thursday, February 5, 2026
spot_img

ఆన్‌లైన్ ఆర్డర్ ట్రాక్ చేస్తూ రూ. 68,000 పోగొట్టుకున్న మహిళ డాక్టర్

రోజుకో స్కామ్‌తో రెచ్చిపోతూ అమాయకుల ఖాతాల నుంచి సొమ్మును ఊడ్చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఆన్‌లైన్ స్కామ్‌లో ముంబైకి చెందిన ఓ డాక్టర్ రూ. 68,000 మోసపోయారు. ఆన్‌లైన్ ఆర్డర్‌ను ట్రాక్ చేసేందుకు మహిళా డాక్టర్ ప్రయత్నిస్తూ సైబర్ నేరగాళ్ల చేతిలో నష్టపోయింది.

కొరియర్ కంపెనీల పేరిట జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని విఖ్రోలికి చెందిన బాధితురాలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి పార్సిల్ కోసం వేచిచూస్తోంది. కొరియర్ రాకలో జాప్యం నెలకొనడంతో బ్లూడార్ట్ డెలివరీ ఏజెంట్‌ను సంప్రదించింది.

ఏజెంట్ కాంటాక్ట్ నెంబర్ లేకపోవడంతో ఆన్‌లైన్‌లో సెర్చి చేసింది. గూగుల్‌లో మొబైల్ నెంబర్ లభించడంతో ఏజెంట్‌కు కాల్ చేసింది. ఆమె ఆర్డర్‌ను ట్రాక్ చేసేందుకు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని స్కామర్ నమ్మబలికాడు. అతడు చెప్పిన సూచనల ప్రకారం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా రూ. 68,000 ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయినట్టు గుర్తించింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ పోలీసులను ఆశ్రయించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular