మహిళలను బాధపెట్టే వారు ఎంతటి గొప్పవారైనా ఫలితం అనుభవించక తప్పదని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. మన పురాణాలు, మత గ్రంథాలు కూడా ఇదే బోధిస్తున్నాయి.ఉదాహరణే ఆఫ్రికా దేశమైన ఈక్విటోరియల్ గునియాలో జరిగిన సంఘటన. వందలాది స్తీల ఉసురు పోసుకున్న ఓ వ్యక్తి బాగోతం తాజాగా బయటపడింది.
ఉన్నత స్థాయి అధికారి బల్తాసార్ ఎబాంగ్ ఎంగొంగా సెక్స్ వీడియోలు సోషియల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈక్విటోరియల్ గినియా ప్రజల్లో ఆగ్రహం రేకెత్తి, ప్రభుత్వంపై దాడులకు దిగారు. ప్రముఖ మీడియా సంస్థ నివేదిక ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని తన కార్యాలయంలో పలువురు మహిళలతో ఆయన సరసాలు నెరిపేవాడని తెలుస్తోంది. అందులోనూ ముఖ్యంగా ప్రముఖ అధికారుల భార్యలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న దాదాపు 400 వీడియోలు బయటపడటంతో ఒక్కసారిగా దేశమంతటా ఆందోళన ఏర్పడింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటువంటి చర్యలకు పాల్పడిన ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేస్తామని దేశ ఉపాధ్యక్షులు టెయోడోరో న్గ్యూమా ఒబియాంగ్ మాంగే ప్రకటించారు. ఇది పబ్లిక్ ఎథిక్స్ కోడ్ ఉల్లంఘనగా పేర్కొన్నారు. గతంలో జరిగిన ఈ తరహా ఘటనల్లో ఉన్నతాధికారుల ప్రమేయం లేదు కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితి ఉండటంతో దేశ వ్యాప్తంగా మరింత ఆసక్తిని రేకెత్తించింది.వాట్సాప్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియోల వ్యాప్తిని నియంత్రించేందుకు టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ మరియు మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలను ఒబియాంగ్ ఆదేశించారు. దీని ప్రభావం నుంచి వివిధ కుటుంబాలను రక్షించడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. కాగా ఇవి బల్తాసార్ స్వయంగా చిత్రీకరించిన వీడియోలుగా తెలుస్తోంది. ఏకంగా తన కార్యాలయంలోనే 400 కంటే ఎక్కువ వీడియోలు రికార్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిధులు దుర్వినియోగం ఆరోపణలపై ప్రస్తుతం మాలాబోలోని బ్లాక్ బీచ్ జైల్లో ఎంగొంగా నిర్బంధంలో ఉన్నాడు. రాజకీయ ప్రముఖులు ఎడ్డో కుమారుడైన బల్తాసార్.. దేశాధ్యక్షుడికి బంధువు కూడా కావడంతో VIPల కుటుంబాలలోని మహిళలతో చాలా తేలికగా అక్రమ సంబంధాలు ఏర్పరుచుకోగలిగాడు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ వీడియోల వ్యాప్తిని నిరోధించేందుకు ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.