ఓ పెద్ద రాజకీయ బ్రాండ్ గల పేకాట గేమింగ్ హౌస్‌పై ఎట్టకేలకు అల్వాల్ పోలీసులు సోదాలు జరిపి 9 మందిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు ను నమోదు చేశారు
ఈ గేమింగ్ అల్వాల్ హిల్స్‌లోని రోడ్డు నెంబర్ 11, 12లో ఉందని వెలుగులోకి వచ్చింది. గతంలో ఈ గేమింగ్ హౌస్పై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ పేకాటడుతున్న వారి బ్యాక్ గ్రౌండ్ తెలిసి మౌనంగా వెనక్కి తిరిగివచ్చారని విశ్వసనీయ సమాచారం.
ఎందుకంటే అందులో పేకాటడుతున్న వారంతా సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారాన్ని గుర్తించి పోలీసులు వెనక్కి తిరిగారానే వాదన ఆ హిల్స్‌లో జోరుగా ఉంది. మరోవైపు అంతా పెద్ద సార్ వర్గం అని చెప్పుకోవడంతో అటు వైపు ఎవరు కన్నెత్తి చూసే వారు కాదనే ప్రచారం ఉంది. చివరకు ఎన్నికల వేళ ఆ గేమింగ్ హౌస్‌పై రైడ్ జరగడంతో పోలీసులు ఎంతైనా పవర్ ఫుల్ అని స్థానికులు మెచ్చుకుంటున్నారు. 9 మంది అరెస్టు చేసిన పోలీసులు రూ.90 వేల నగదు, మొబైల్ ఫోన్‌లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఇప్పటి వరకు గుపచుప్ గా ఉన్న పోలీసులు అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది… పుల్ డిటైల్స్ కోసం ట్రై చేస్తున్నాం అంటున్నారు పోలీసులు