spot_img
Monday, March 23, 2026
spot_img

ఇంటికి పిలిచి ప్రియుడిని చంపిన ప్రియురాలు..ట్రెండ్ సెట్ చేసింది

ఇంట్లో ఎవరూ లేరని ప్రియుడిని ఇంటికి పిలిచింది ఓ ప్రియురాలు. ఎగిరి గంతేసుకుంటూ వచ్చిన ప్రియుడిని.. దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.

పేట్ బషీరాబాద్ పీయస్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనికి చెందిన కైలాష్‌ చౌదరి (38) , ఓరారామ్ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులు ఎలక్ట్రానిక్ షాపు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓరారామ్ ఇంటికి కైలాష్ తరచూ వచ్చి వెళ్తుండేవాడు. ఈ సమయంలోనే ఓరారామ్ భార్య సీతాదేవితో కైలాష్ చౌదరికి అక్రమసంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత సీతాదేవికి, కైలాష్‌ చౌదరికి వ్యక్తిగత విభేదాలు వచ్చాయి.

దాంతో అతని అడ్డు తొలగించుకోవాలని సీతాదేవి భావించింది. అందులో భాగంగా కైలాష్‎ను శనివారం రాత్రి ఇంటికి రావాలని కోరింది. ఇంటికి వచ్చిన అతడి మీద దాడి చేసింది. కళ్లల్లో కారం చల్లి, సుత్తితో తలపై బాది హత్య చేసింది.

సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular