భారత్ మోస్ట్ వాంటెడ్ (India most wanted), అక్రమ ఆయుధాల సరఫరాలో కీలక నిందితుడు షేక్ సలీమ్ అలియాస్ సలీమ్ పిస్టల్ (Salim Pistol)ను అరెస్ట్ అయ్యాడు.ఢిల్లీ పోలీసులు (Delhi police) నేపాల్‌లో (Nepal) శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సలీమ్ పిస్టల్‌ను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, భారత భద్రతా సంస్థలు నేపాల్ పోలీసుల సాయంతో అరెస్టు చేశాయి. పాకిస్థాన్ నుంచి ఆయుధాలను దిగుమతి చేసి, భారత్‌లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. అలాగే, అతడికి పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ, దావూద్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సలీమ్ పిస్టల్ లారెన్స్ బిష్ణోయ్, హషీమ్ బాబా వంటి టాప్ గ్యాంగ్‌స్టర్‌లకు ఆయుధాలు సరఫరా చేసే కీలక వ్యక్తిగా ఉన్నాడు. 2018లో ఢిల్లీ పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అయితే, తప్పించుకుని విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుంచి అతడిని పోలీసులు ఇండియా మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు.
సలీమ్ నేపాల్‌లో దాక్కున్నాడని భారత్ భద్రతా సంస్థలకు ఇటీవల సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా భద్రతా సంస్థలు అతన్ని ట్రాక్ చేసి అరెస్టు చేశాయి. ఢిల్లీలోని జాఫ్రాబాద్‌కు చెందిన షేక్ సలీమ్ 8వ తరగతి వరకు విద్యానభ్యసించాడు. అనంతరం కొంతకాలం డ్రైవర్‌గా పనిచేశాడు. 2000లో వాహన దొంగతనంతో అతని క్రిమినల్ జీవితం ప్రారంభమైంది. అతను తన సహచరుడు ముకేష్ గుప్తా, ఉర్ఫ్ కాకాతో కలిసి బహుళ వాహనాలను దొంగిలించాడు. ఈ క్రమంలో అరెస్టు అవ్వటంతో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 379, 411, 34 కింద కేసు నమోదైంది. ఆ తర్వాత, 2011 జాఫ్రాబాద్‌లో రూ.20 లక్షలతో కూడిన హై-ప్రొఫైల్ ఆర్మ్డ్ రాబరీలో అతను పాల్గొన్నాడు. 2013న అతను మరోసారి అరెస్టయ్యాడు. నాటి నుంచి దశాబ్ధాలుగా అతడి నేర చరిత్ర కొసాగుతూ వస్తోంది.
ఇండియా మోస్ట్ వాంటెడ్ సలీమ్ పిస్టల్ అరెస్ట్
RELATED ARTICLES