ఆధార్ కార్డు కొత్త మొబైల్ యాప్ ను అందుబాటులోకి వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డులోని వివరాలను సవరించుకోవడానికి ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇంట్లో నుంచే మార్పులు చేసుకునేందుకు వీలుగా ఒక తెచ్చింది. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ ద్వారా కీలకమైన వివరాలను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త యాప్ లో మొబైల్ నంబర్ ను మార్చుకునే సదుపాయాన్ని యూఐడీఏఐ లైవ్ చేసింది. వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని, ఫేస్ అథెంటికేషన్ ద్వారా తమ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాత రూ. 75 ఫీజు చెల్లించి కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సుమారు 30 రోజుల్లోగా కొత్త నంబర్ ఆధార్ తో లింక్ అవుతుంది. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు సేవల వరకు ఆధార్ కార్డు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. అందుకే అందులోని పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి వివరాలు కచ్చితంగా ఉండటం తప్పనిసరి. యూఐడీఏఐ ఈ కొత్త యాప్ ను తీసుకొచ్చింది.*
ఇకపై ఇంట్లోనుంచే ఆధార్ తో అన్నీ
RELATED ARTICLES



