తనకంటూ ఎవరూ లేక ఆదుకునే వారు లేక చివరి దశలో ఒంటరివాడయ్యాడో ముసలాయన ఆ ముసలాయన ముసలాయన.. ఒంట్లో సత్తువలేక బిచ్చగాడిగా మారాడు.. గుడి దగ్గర యాచన చేస్తూ జీవితాన్ని లాగిస్తున్నాడు.. అలా వచ్చిన డబ్బులో కొంత బిడ్డ భవిష్యత్ కోసం దాచుకున్నాడు.ఇలాంటి ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. బోనకల్ మండల కేంద్రంలో యాచకుడి దగ్గర అప్పు తీసుకున్న ఓ వ్యాపారి ఐపీ పెట్టాడు. ఎన్నో ఏళ్ల నుంచి సాయిబాబా గుడి దగ్గర భార్యతో కలిసి అశోక్ అనే యాచకుడు బిచ్చం ఎత్తుకుంటున్నాడు. అయితే మూడు సంవత్సరాల క్రితం వారు దాచుకున్న 50వేల రూపాయాలను అప్పుగా తీసుకున్నాడు హోటల్ వ్యాపారి నర్సింహారావు. అప్పటి నుంచి వడ్డీ ఇవ్వకపోగా.. మొత్తానికే పంగనామం పెట్టాడు. అప్పు తిరిగి ఇవ్వకుండా మొఖం చాటేశాడు వ్యాపారి నర్సింహారావు. ఇటీవల యాచకుడు అశోక్‌తో పాటు మొత్తం 69 మందికి ఐపీ నోటీసులు పంపాడు. ఖమ్మంలోని సివిల్ కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. మొత్తం ఒక కోటీ 95లక్షల అప్పు తీసుకొని.. 69మందికి ఐపీ నోటీసులు ఇచ్చాడు. నోటీసులు పొందిన వారిలో యాచకుడు గొళ్లల అశోక్ కూడా ఉండడంతో స్థానికులంతా విస్తుపోతున్నారు. పాపం పెద్దాయన కూడా చూడకుండా మోసం చేసిన ఇలాంటి వ్యక్తులు పట్ల పోలీసులు కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు.ఎన్నో ఏళ్లుగా బిచ్చం ఎత్తుకుని.. దాచుకున్న డబ్బును వ్యాపారి నర్సింహారావును నమ్మి ఇస్తే నట్టేట ముంచాడని యాచకుడు అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన బిడ్డ చదువు కోసం దాచుకున్న డబ్బును వ్యాపారికి అప్పుగా ఇచ్చానని.. తనకు న్యాయం చేయాలంటూ వేడుకొంటున్నాడు యాచకుడు అశోక్. బిచ్చగాడినే ముంచేసిన నర్సింహారావు వ్యవహారం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇచ్చిన బిచ్చగాడికి ఐపీ నోటీస్ పంపిన మహానుభావుడు
RELATED ARTICLES




