spot_img
Tuesday, March 24, 2026
spot_img

ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం, ఉద్యోగం ఇస్తానని గదికి పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ పై అత్యాచారం

: హైదరాబాద్ లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం చేసుకుని యువతి గదికి రప్పించి ఆమెపై దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి.ఆ యువతి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ మరోసారి కలకలం రేపింది. ఇటీవల టాలీవుడ్ లో అత్యాచారం ఆరోపణలు ఎక్కువయ్యాయి. యూసఫ్ గూడ పరిధిలోని మధురానగర్ లో ఈ దారుణం జరిగింది. రహమత్ నగర్ కు చెందిన ఓ మహిళ (30)… అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. ఆమె ఈ ఏడాది జూన్ లో తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఇటీవల ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో శశికిరణ్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

శశి కిరణ్ రెడ్డి తనకు మూవీ ఆఫీస్ ఉందని, అందులో పనిచేయాలని యువతికి మాయమాటలు చెప్పాడు. ఈ నెల 27వ తేదీ రాత్రి మధురానగర్ లోని తన గదికి రావాలని శశికరణ్ రెడ్డి కోరడంతో ఆమె అక్కడికి వెళ్లింది. ఆమెను గదిలో బంధించిన శశికరణ్ రెడ్డి అత్యాచారం చేశాడు. ఆ గది నుంచి తప్పించుకున్న యువతి… పై అంతస్తులోని వారికి విషయాన్ని చెప్పడంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular