spot_img
Tuesday, March 24, 2026
spot_img

ఈడీ కస్టడీలో ఉన్న ఇంటిని అమ్మిన నౌహీరాపై చీటింగ్ కేసు


ఈడీ కస్టడీలో ఉన్న ఇంటిని తమకు విక్రయిస్తానని రూ. కోట్లు తీసుకుని మోసం చేయ డమే కాకుండా ఇంటిని ఖాళీ చేయాలంటూ రౌడీలతో దౌర్జన్యానికి దిగిన నౌహీరాషేక్పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమారుడు బండ్ల హీరేష్ ఫిలింనగర్ రోడ్డునెంబర్-13 సైట్-2లోని ప్లాటెనెంబర్ 15-ఏలో నౌహీరా షేక్కు చెందిన ఇంట్లో 2023 నుంచి అద్దెకు ఉంటున్నాడు. నౌహీరా షేక్ సదరు ఇంటిని అమ్ముతున్నట్లుగా చెప్పడంతో తామే కొనుగోలు చేస్తామని గత ఏడాది మార్చి 23న నౌహీరాకు రూ.3 కోట్లు అడ్వాన్స్డ్ ఇచ్చాడు. మిగతా మొత్తాన్ని కూడా జమ చేస్తున్న సమయం లో ఈ ఇల్లు ఈడీ కేసులో ఉన్నట్లుగా తెలిసిం దన్నారు. అయితే నౌహీరా మాత్రం మిగతా డబ్బులు చెల్లించాల్సిందిగా తమపై ఒత్తిడి చేస్తుం దని, కేసు విషయం ప్రస్తావించగా దాటవేస్తూ వస్తుందని ఆరోపించారు. ఈ నెల 15న మధ్యాహ్నం నౌహీరాషేక్ 10 మంది రౌడీలతో కలిసి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడిందని, అసభ్య పదజాలంతో దూషించిం దని ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హీరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు నౌహీరాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular