spot_img
Monday, July 21, 2025
spot_img

ఈవీఎంలను హ్యక్ చేయొచ్చు.. ఎలాన్ మస్క్

బిజినెస్ టైకూన్ ఎలోన్ మస్క్ మరోసారి ఈవీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు. ఏ దేశంలోనైనా అధ్యక్ష ఎన్నికల కోసం ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టాలనీ అయాక అభిప్రాయ పడ్డారు.అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానం పెట్టాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవలే ఇండియాలో పలు రాష్ట్రాల్లో జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (EVM) రద్దు చేయాలని ఎలోన్ మస్క్ పిలుపునిచ్చిన సంగతి తెలిసింతే. కాగా వాటిని మానవులు లేదా AI ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని ఆయన మరోసారి హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన టౌన్ హాల్ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో కలిసి ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ మాట్లాడుతూన.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికలకు దూరంగా ఉంచాలన్నారు. ఈ ప్రయోజనం గురించి ఆయన వివరంగా చెప్పారు. యంత్రాలకు బదులుగా పేపర్ బ్యాలెట్లను నేను ఇష్టపడతానని, ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు చేతులతో లెక్కించే బ్యాలెట్ పేపర్ తో జరగాలని సూచించారు.

EVM లను హ్యాక్ చేయడం చాలా సులభం..

‘నేను సాంకేతిక నిపుణుడిని.. కంప్యూటర్ల గురించి బాగా తెలుసు. నేను కంప్యూటర్ ప్రోగ్రామ్లను విశ్వసించను. ఎందుకంటే వాటిని హ్యాక్ చేయడం చాలా సులభం. కానీ పేపర్ బ్యాలెట్ హ్యాక్ చేయడం కష్టం. ఒక ఐడితో ఒక వ్యక్తి ఓటు వేయడం ఇది ప్రతి దేశంలో అమలువుతోంది. కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగే దాదాపు ప్రతి దేశంలో పేపర్ బ్యాలెట్ ఆధారంగానే తుది ఫలితాలు వెల్లడించాలి. ఇది జరగకపోవడం చాలా విచిత్రం’ అని మస్క్ అభిప్రయాయపడ్డారు. ఇక మస్క్ పేపర్ బ్యాలెట్కు మద్దతు ఇస్తూ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

EVM లను AI ద్వారా హ్యాక్ చేయవచ్చు.

అయితే ఎన్నికల్లో టెక్నాలజీని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ మస్క్ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. భారతదేశంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మానవులు లేదా AI ద్వారా హ్యాక్ చేయబడే ప్రమాదం ఉందని, వాటిని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మస్క్ ప్రకటన తర్వాత, మాజీ కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈవీఎంలపై ట్యుటోరియల్ నిర్వహించడానికి మస్క్కు ఆఫర్ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular