spot_img
Thursday, June 5, 2025
spot_img

ఉగ్రకార్యకలాపాల వెనుక విజయనగరం సిరాజ్ లవ్ (ఫెయిల్యూర్) స్టోరీ ఉంది తెలుసా

ఆపరేషన్ సిందూర్ హాట్ టాపిక్ గా మారిన వేళ విజయనగరంలో సిరాజ్ ఉర్ రెహ్మాన్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ లో ఉండే వ్యక్తుల మద్దతుతో అతడు దేశవ్యాప్తంగా బ్లాస్ట్ లకు ప్లాన్ చేశాడనే విషయం తాజాగా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.అయితే అతడు ఇలా మరడం వెనుక ఓ లవ్ స్టోరీ ఉందనే విషయం తెరపైకి వచ్చింది.

అవును… విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు అతడు ఇలా మారడం వెనుక ఒక లవ్ (ఫెయిల్యూర్) స్టోరీ కూడా ఉందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన లవ్ జీహాద్ కి పూర్తి వ్యతిరేకంగా ఉండటం గమనార్హం!

సిరాజ్ బీటెక్ చదివేటప్పుడు తన మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడట. అయితే.. ఆమె అతడిని కాకుండా మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించింది. దీంతో… ముస్లిం యువతులను హిందూ యువకులు ప్రేమ పేరిట ఉచ్చులోకి దించుతున్నారని.. ఇది “భగ్వా లవ్ ట్రాప్” అని సిరాజ్ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు!

ఇందులో భాగంగా.. దానికి వ్యతిరేకంగా పోరాడాలని సోషల్ మీడియా వేదికగా అతడు పలువురిని సమీకృతం చేయడం మొదలుపెట్టాడు. క్రమక్రమంగా ఈ కార్యకలాపాలను భారత్ పై యుద్ధమే లక్ష్యంగా అతడు స్థాపించినట్లు చెబుతున్న అల్-హింద్ ఇత్తేహోదుల్ ముస్లిమీన్ (అహిం) సంస్థ పేరిట నడిపించాడని చెబుతున్నారు.

వాస్తవానికి హైస్కూల్ లో చదువుతున్నప్పుడు విజయనగరం జిల్లా కొత్తవలస సమిజిపంలోని ఓ మదర్సాకు సిరాజ్ తరచూ వెళ్తుండేవాడట. ఆ సమయంలోనే అతడికి ఉత్తరప్రదేశ్ కు చెందిన మౌలానా ఫజియాఖాన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని.. అతడి ప్రభావంతోనే సిరాజ్ లో ఛాందసవాదం, మతోన్మాద భావనలు మొగ్గ తొడిగాయని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీసు అధికారులు చెబుతున్నారు!

కాగా… దేశంలో “లవ్ జీహాద్” తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారనేదే లవ్ జీహాద్! ఈ క్రమంలో.. దీనికి పూర్తి వ్యతిరేకమైన అనుభవం తనదని సిరాజ్ ప్రచారం చేశాడని అంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular