spot_img
Sunday, July 20, 2025
spot_img

ఉరిశిక్షపై సీజేఐ ప్రశ్న.. ‘ఏఐ లాయర్’ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్

నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో ఏర్పాటు చేసిన ఏఐ లాయర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యూజియం ప్రారంభోత్సవానికి సుప్రీం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సీజేఐ ఏఐ లాయర్ పనితనాన్ని టెస్ట్ చేయాలని భావించారు. భారతదేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనా? అని ప్రశ్నించారు. అది చెప్పిన సమాధానానికి సీజేఐ ఆశ్చర్యపోయారు.

అడ్వకేట్ టై, నల్ల కోటు ధరించి కళ్లద్దాలతో ఓ వ్యక్తి రూపంలో ఉన్న ఏఐ మెషీన్ సమాధానం చెప్పింది. “అవును, మరణశిక్ష భారతదేశంలో రాజ్యాంగబద్ధం. తీవ్ర స్థాయి నేరాల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయించిన అరుదైన కేసుల కోసం ఈ శిక్షను అమలు చేస్తారు అంటూ గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పింది. అది విని జస్టిస్ చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. నవ్వుతూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు చేసిన కొత్త మ్యూజియం సుప్రీంకోర్టు ధర్మాన్ని, దేశానికి దాని ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు. మ్యూజియం యువ తరానికి ఇంటరాక్టివ్ స్పేస్‌గా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular