కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీవీ (NTV) అధినేత నరేంద్ర చౌదరి గురించి రకరకాల ఊహాగానాలు, దుష్ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆయన బ్యాంకాక్ వెళ్లారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, మిర్చి న్యూస్‌కు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు.
వాస్తవం ఇదే
నరేంద్ర చౌదరి గారు ఎక్కడికీ వెళ్లలేదు. ప్రతిరోజూ తన కార్యాలయంలోనే ఉంటూ, నిత్య విధుల్లో నిమగ్నమై ఉన్నారని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయన్ని కలసి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలోని ఫోటోలు కూడా బయటకు రావడంతో, బ్యాంకాక్ పుకార్లకు తెరపడింది.
ఉద్యోగుల పక్షపాతి
మాటలకే కాదు, చేతలకూ నిలబడ్డ యజమాని
“ఆస్తులైనా అమ్ముతాను కానీ ఉద్యోగుల జీతాలు ఆపను” — ఇది మాటలకే పరిమితం కాకుండా, ఆచరణలో చూపించిన వ్యక్తి నరేంద్ర చౌదరి గారు.
2014–19 మధ్య కాలంలో ‘నోటుకు ఓటు’ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఛానల్ ప్రసారాలపై నిషేధం విధించడంతో ఆదాయం తీవ్రంగా పడిపోయినా, ఒక్క రోజు కూడా జీతాలు ఆపలేదు.
నేటికీ ప్రతి నెల 30వ తేదీకి ఉద్యోగుల జీతాలు ఖచ్చితంగా అందుతున్నాయని యాజమాన్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అయన విదేశాల్లో ఉన్నా కూడా జీతాల విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండదన్నది అందరికీ తెలిసిన వాస్తవం.
ఎన్టీవీలో అంతర్గత ప్రజాస్వామ్యం
నరేంద్ర చౌదరి గారు స్వతహాగా జర్నలిస్ట్ కాకపోయినా, వార్తల విషయంలో తన అభిప్రాయాలను రుద్దే వ్యక్తి కాదు.
సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయాలను గౌరవిస్తూ, కీలక నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత.
“మీరు జర్నలిస్టులు, మీకే ఎక్కువ తెలుసు”
అన్న నమ్మకంతో వార్తల ఎంపికలో సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తారు
నిష్పక్షపాత వైఖరి – ఒత్తిడులకు తలొగ్గని తత్వం
ప్రభుత్వాలు మారినా, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా వార్తల గొంతు నొక్కేందుకు ఆయన సిద్ధంగా లేరు.
ప్రకటనలు తగ్గుతాయని, నష్టం వస్తుందని తెలిసినా, తన పంథా మార్చుకోని ధైర్యమే ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతోంది.
ఆధ్యాత్మిక & సామాజిక సేవ
న్యూస్ ఛానల్‌తో పాటు మహిళల కోసం వనిత టీవీ, ఆధ్యాత్మిక రంగంలో భక్తి టీవీని విజయవంతంగా నడుపుతున్నారు.
నేడు దేశంలోనే భక్తి టీవీ అగ్రస్థానంలో ఉండడం ఆయన పట్టుదలకి నిదర్శనం అని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.
మానవీయ కోణం
ఉద్యోగిని తొలగించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా,
“ఏదో ఒక టాలెంట్ చూసే కదా తీసుకున్నాం… మరో విభాగంలో అవకాశం ఇవ్వండి”
అని ఆలోచించే మానవీయ యజమాని నరేంద్ర చౌదరి గారు.
మిర్చి న్యూస్ విశ్లేషణ
సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం, నరేంద్ర చౌదరి గారి అసలు వ్యక్తిత్వానికి ఏమాత్రం పొంతన లేదు.
ఒక వ్యక్తిగా కాకుండా, ఒక వ్యవస్థగా నిలబడి వేల మందికి ఉపాధి కల్పిస్తూ, విలువలతో కూడిన మీడియాను నడుపుతున్న వ్యక్తి అన్నది ఆయనతో కలిసి పనిచేసిన వారి ఏకగ్రీవ అభిప్రాయం.
గమనిక:
ఈ కథనం సోషల్ మీడియాలో మరియు కొన్ని వర్గాల్లో నరేంద్ర చౌదరి గారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు, గతంలో ఆయన వద్ద పనిచేసిన వారు పంచుకున్న వాస్తవాల ఆధారంగా రూపొందించబడింది.
మిర్చి న్యూస్ – నిజానికి నిలువెత్తు నిదర్శనం
నేను TV9.. TV5..ABN న్యూస్.. RAJ News….CVR..99TV..No1 లాంటి పెద్ద చానల్స్ లో క్రైమ్ బ్యూరో గా పనిచేసిన NTV లో పనిచేసే అవకాశం రాలేదు నేను ట్రై కూడా చెయ్యలేదు కానీ NTV చైర్మన్ గురించి విన్న వాస్తవాలు ఇవి ఆయన ఉద్యోగుల పక్షాన నిలబడే వ్యక్తి అని




