spot_img
Monday, July 21, 2025
spot_img

ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను ఎవరైనా గిఫ్ట్‌గా ఇస్తున్నారా? నిలువు దోపిడీ అయిపోతారు.. జాగ్రత్త!

పండుగ సీజన్‌లో కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం సాధారణమే. ఇస్తున్నవారిని వద్దనలేం. ఊరించే బహుమతిని అందుకోకుండా ఉండనూ లేం. అవి ఏ మిఠాయిలో అయితే చిటికెలో డబ్బా ఖాళీ చేసేయొచ్చు. పుస్తకాలైతే చదివినా చదవకపోయినా బుక్‌షెల్ఫ్‌లో అలంకరించవచ్చు. కానీ, ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు తీసుకోకపోవడమే మంచిది. తీసుకున్నా.. అందులో ఎలాంటి బగ్స్‌ లేవని నిర్ధారించుకున్నాకే ఉపయోగించాలి.అనగనగా ఒక అమ్మాయి. ఓ పెద్ద కార్పొరేట్‌ కంపెనీలో పనిచేసేది. తెలివైనది. అందమైనది. నెట్‌వర్కింగ్‌ వెన్నతో పెట్టిన విద్య. ఏదో కార్యక్రమంలో ఓ పెద్దమనిషి తనకు ఓ సెల్‌ఫోన్‌ కానుకగా ఇవ్వబోయాడు. కంపెనీ ఎథిక్స్‌కు వ్యతిరేకం కాబట్టి, వద్దని చెప్పింది. అయినా అతను వినలేదు. సీఈవో స్థాయి వ్యక్తిని అంతకుమించి ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక.. మొహమాటంగానే అందుకున్నది. ఖరీదైన ఫోన్‌. సరికొత్త ఫీచర్స్‌. ఎన్నిరోజులని పక్కనపెడుతుంది. ఓ బలహీన క్షణంలో సిమ్‌కార్డ్‌ వేసుకుంది. మరునిమిషం నుంచీ మాట్లాడిన ప్రతి కాల్‌, పంపిన ప్రతి మెసేజ్‌, షేర్‌ చేసుకున్న ప్రతి ఫొటో ఇంకెవరికో వెళ్లిపోయేవి. దాంతోపాటే ఆమె పనిచేస్తున్న కంపెనీకి సంబంధించిన కీలకమైన సమాచారమూ. అందులో ఓ బగ్‌ ఇన్‌స్టాల్‌ చేయడం వల్ల ఇదంతా సాధ్యమైంది. ఆ విషయం తెలిసేలోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘ఆల్టర్నేటివ్‌ జూస్‌ జాకింగ్‌’ అని వ్యవహరిస్తారు. కార్పొరేట్‌ కుట్రలకు, అద్దాల మేడల గూఢచర్యాలకు సెల్‌ఫోన్‌ తిరుగులేని ‘స్పూఫింగ్‌ డివైజ్‌’గా మారింది. స్మార్ట్‌ఫోనే కాదు, చార్జర్‌లోని గడ్డలోనూ రహస్య సాఫ్ట్‌వేర్‌ను జొప్పిస్తున్నారు. చార్జింగ్‌ పూర్తయ్యేలోపు సెల్‌ఫోన్‌లోని డేటా మొత్తం బదిలీ అయిపోతుంది.ఎయిర్‌పోర్టులు, మాల్స్‌ తదితర జనసమ్మర్ధ ప్రాంతాల్లో, బస్సు, రైలు ప్రయాణాల్లో అపరిచితుల (కొన్నిసార్లు పరిచయస్థులు కూడా) చార్జింగ్‌ పరికరాల్ని వాడకపోవడమే ఉత్తమం, సురక్షితం. సెల్‌ఫోన్‌ యాక్టివేట్‌ చేసుకుంటున్నప్పుడు.. అలవ్‌ టు ట్రాక్‌, అలవ్‌ నాట్‌ టు ట్రాక్‌ అనే ఆప్షన్స్‌ వస్తాయి. ట్రాకింగ్‌ను అనుమతించకపోవడమే మేలు. పొరపాటున ఓకే చేస్తే.. మన డాటా మొత్తం ఎవరి చేతుల్లోకో వెళ్లిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగిందంతా ఒక్కటే. జాగ్రత్తగా ఉండటం. వివేకంతో స్పందించడం. విచక్షణతో సాంకేతికతను ఉపయోగించడం. తక్షణ వ్యామోహాలకు గురికాకపోవడం.

బహుమతులు వద్దు

ఎవరు ఇచ్చినా, ఎంత ఖరీదైనది అయినా సరే.. ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని బహుమతిగా తీసుకోకూడదు. ఆ మధ్య ఒక సెలెబ్రిటీకి ఓ మిత్రుడు ‘జామర్‌’ అంటూ ఓ ఎక్విప్‌మెంట్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ‘దీన్ని కనుక అమరిస్తే.. ఫోన్‌ ట్యాపింగ్‌ జరగదు సార్‌’ అంటూ నాలుగు సాంకేతిక పదాలు జోడిండి చెప్పాడు. ఆయన నమ్మాడు. నిండా మునిగాడు. మరో కేసులో ఓ పలుకుబడి కలిగిన వ్యక్తికి ఎవరో ఖరీదైన కాఫీ మేకింగ్‌ మెషీన్‌ పంపారు. వేడివేడిగా చిక్కని కాఫీ ఆస్వాదించే అవకాశం దొరికిందని మురిసిపోయాడే కానీ,అందులో రహస్య కెమెరా ఉన్న సంగతే గుర్తించలేకపోయాడు పెద్దాయన. ఇలాంటి ఉదాహరణలు అనేకం. ఇక స్మార్ట్‌ఫోన్‌ మరింత ప్రమాదకరం. మన వ్యక్తిగత, వృత్తిగత రహస్యాలన్నీ అందులోనే ఉంటాయి. ఫ్రీగా వస్తుంది కదా అని పుచ్చుకుంటే మాత్రం, మన జాతకాన్ని మరొకరి చేతిలో పెట్టినట్టే. చార్జింగ్‌ త్వరగా అయిపోతున్నా, వీడియోలు ఆగి ఆగి వస్తున్నా, ఇట్టే వేడెక్కిపోతున్నా, హఠాత్తుగా స్విచ్‌ ఆఫ్‌ అవుతున్నా.. అనుమానించాల్సిన అవసరం ఉందన్నమాటే. పైన చెప్పిన కార్పొరేట్‌ అమ్మాయికి కూడా ఇలాంటి ఓ సందర్భంలోనే అనుమానం వచ్చింది. సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లినప్పుడు అసలు సంగతి బయటపడింది. ముంబైలో ఓ సంపన్నుడికి ఎవరో ఎలక్ట్రానిక్‌ డోర్‌ లాకర్‌ కానుకగా ఇచ్చారు. బావుంది కదా అని బిగించుకున్నాడు. దీంతో అవతలి వ్యక్తికి.. అతని రాక
పోకలన్నీ తెలిసిపోయేవి. కుటుంబ సభ్యుల కదలికలూ అర్థమైపోయాయి. అంతా వీకెండ్‌ టూర్‌ వెళ్లినప్పుడు.. దర్జాగా వెళ్లి దొంగతనం చేసుకుని వచ్చాడు. నగదు, బంగారం, వెండి సామగ్రి దోచుకువెళ్లాడు. ఓ చిన్న బహుమతికి ఆశపడటం వల్ల.. ఇంత పెద్ద ఉత్పాతం జరిగిపోయింది. మ్యూజిక్‌ సిస్టమ్స్‌, స్పీకర్స్‌, ఎలక్ట్రానిక్‌ వాల్‌క్లాక్స్‌, ఇ-టాయ్స్‌.. ఏదీ మినహాయింపు కాదు. కాబట్టి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంతేకాదు, ఏ అప్లికేషన్‌ అయినా ప్లే స్టోర్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌

డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. డిజిటల్‌ ఇంటెలిజన్స్‌ లేకపోవడమే ఈ ఉత్పాతాలకు కారణం. అలా అని, మనమేం సైబర్‌ క్రైమ్‌ నిపుణులు కానవసరం లేదు. మనల్ని మనం రక్షించుకునేంత పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలు.

సోషల్‌ ప్రొఫైలింగ్‌

మీరు ఏ రుణం కోసమో అప్‌లోడ్‌ చేసిన ఆధార్‌ నుంచి మీ పేరు, వయసు, చిరునామా సేకరిస్తారు. మీ లావాదేవీల నుంచి మీ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించుకుంటారు. మీ సోషల్‌ మీడియా పోస్టుల ఆధారంగా అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకుంటారు. మీ అవసరాలను అర్థం చేసుకుంటారు. మొత్తానికి, మీ గురించి మీ మిత్రులకంటే, మీ కుటుంబసభ్యుల కంటే కూడా ఎక్కువే తెలుస్తుంది వారికి. దీన్నే ‘సోషల్‌ ప్రొఫైలింగ్‌’ అంటారు. మీ బలహీనతలు తెలిశాక.. వల విసరడం మహాసులభం. మీ అవసరాలు అర్థమైపోయాక గాలం వేయడం చిటికెలో పని.సో అందరూ ఈ విషయం లో జాగ్రత్తగా ఉండాలని టెక్నికల్ పీపుల్ ఏలర్ట్ చేస్తున్నరు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular