అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకుని ఓ మహిళ స్థానిక వన్‌టౌన్, టూటౌన్, రూరల్, ఇటుకలపల్లి సీఐలకు నకిలీ ఫోన్‌కాల్ చేసింది.’అర్జెంట్ పని మీద ఉన్నాను.. కొంత డబ్బులు పంపండి’ అంటూ వాట్సప్‌లో చాటింగ్ చేసింది. సదరు విషయంపై వన్‌టౌన్ సీఐ రెడ్డెప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక పోలీసుబృందం రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా ఫేక్‌కాల్, మెసేజ్ వచ్చిన ఫోన్ నంబరు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందినదిగా గుర్తించారు. ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కోయంబత్తూరుకు వెళ్లి సైబర్ నేరానికి యత్నించిన విజయలక్ష్మిని కేసు విచారణ నిమిత్తం అనంతపురం తీసుకొచ్చి అరెస్టు చేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఆమె ఇలా సైబర్ నేరాలకు పాల్పడినట్లు విచారణలో ఆమె వెల్లడించింది.
ఎస్పీ పేరుతో నకిలీ ఫోన్‌కాల్, వాట్సప్ చాటింగ్ చేసిన మహిళ (లేడి సైబర్ క్రిమినల్)
RELATED ARTICLES