ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చిది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఓ పార్టీ నేత శ్రీనివాస్ నాయుడు లైంగిక వేధింపుల ఆడియో లీకయింది
.ఉపాధి హామీ మహిళా కూలీలకు డబ్బుతో ఎర వేస్తున్న ఓ లోకల్ నేత లైంగిక వేధింపుల ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 3 లక్షలు లోన్ ఇప్పిస్తా.. బయటకు రావడానికి వీలు అవుతుందా?. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా..
తన కోరిక తీర్చాలంటూ శ్రీనివాస్ నాయుడు వేధింపులకు గురిచేశాడు. అతనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు