సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేసి ఏపీకి చెందిన ఓ వైద్యుని వద్ద రూ.38 లక్షలు కొట్టేశారు.ఏపీలోని నంద్యాల Nandyal Town) పట్టణం పద్మావతినగర్లో రాహుల్ ఆస్పత్రి అధినేత డాక్టర్ రామయ్యకు 2 రోజుల కిందట సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. తాము సీబీఐ అధికారులమని సీబీఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. మీ సెల్ నెంబర్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని.. దీనిపై ఢిల్లీ పోలీస్ స్టేషన్లో హ్యూమన్ ట్రేడింగ్, మనీ లాండరింగ్, ఛీటింగ్ కేసులు నమోదయ్యాయని భయపెట్టారు. ఆన్ లైన్ విచారణ జరుపుతామని.. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో వైద్యుడు ఆందోళనకు గురి కాగా.. దీన్ని ఆసరాగా చేసుకుని రూ.38 లక్షలు పంపితే కేసుల నుంచి తప్పిస్తామని.. లేకుంటే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. భయపడిన వైద్యుడు వారి చెప్పినట్లే చేశారు. తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు రూ.38 లక్షలు పంపించారు. అలాగే, అరగంట పాటు డాక్టర్ను కాల్లో ఉంచి ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి హ్యాక్ చేశారు. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న డాక్టర్ టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏపీలో వైద్యుడికి రూ.38 లక్షలు టోకరా
RELATED ARTICLES