సైబర్ మోసాలపై ఎంతటి అవగాహన కల్పిస్తున్నా తరచూ వాటి వలలో ఎవరో ఒకరు చిక్కుకుపోతూనే ఉన్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ కేటుగాళ్లు మాత్రం మాయ మాటలతో బోల్తా కొట్టించి పెద్ద ఎత్తున డబ్బులు ఎగరేసుకుపోతున్నారు.బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగికి పోలీసు అధికారులమంటూ నమ్మించి రూ.3.5 కోట్ల డబ్బును దోచుకున్నారు. అసలేం జరిగిందంటే..?
బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి గుర్తు తెలీని నంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నాం. ముంబయిలోని పోలీస్ స్టేషన్‌లో మీపై క్రిమినల్ కేసు, ఆధార్ కార్డు వివరాలతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. విచారణ కోసం ముంబయికి రావాల్సి ఉంటుంది’ అని సైబర్ మోసగాళ్లు ఆ వ్యక్తికి నమ్మించారు. ఆపై మరో నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే ఖాకీ దుస్తులు, ఫేక్ ఐడీ కార్డుల్ని, కంప్లెయింట్ కాపీని చూపించి ఆ వ్యక్తిపై బెదిరింపులకు దిగారు.అరెస్టు చేయకుండా కేసును పరిష్కరించాలంటే వారి బ్యాంకు ఖాతాలకు డబ్బుల్ని బదిలీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు చెప్పినట్లుగానే బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేశారు. కేవలం 48 గంటల్లోనే ఏకంగా రూ.3.7 కోట్ల డబ్బుల్ని వారు చెప్పిన అన్ని ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తిరిగి కాల్ అయితే ఆ సైబర్ మోసగాళ్లు కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వ్యక్తి పోలీసు స్టేషన్‌కు ఆశ్రయించాడు. అయితే రూ.3 కోట్ల కంటే ఎక్కువ డబ్బులకు సంబంధించిన అంశం కావటంతో పోలీసులు ఈ కేసును సీఐడీకి అప్పగించారు.
ఐటీ ఉద్యోగికి సైబర్ మోసగాళ్ల వల.. రూ.3.5 కోట్లకు టోకరా!
RELATED ARTICLES