spot_img
Thursday, February 5, 2026
spot_img

ఓయోలో రూమ్ లో మైన బాలిక అత్యాచారం.. నిందితులు అరెస్ట్

విచ్చలవిడి తననికి ఓయో రూమ్స్ అడ్డాగా మారుతున్నాయి .మేజర్ల కు మాత్రమే అనుమని ఉన్న Oyo రూమ్స్ కి మైనర్స్ నీ అనుమతి ఇవ్వడం తో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి అడిగేవాడు లేదు ఏమన్న కోర్ట్ పర్మిషన్ ఉంది అంత లీగల్ అంటూ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి oyo రూమ్స్ పోలిస్ నిఘా లేకపోవడం తో విశ్రుంఘలత్వనికి కేరాఫ్ అడ్రస్ గా ఈ oyo రూమ్స్ మారుతున్నాయి..ఇక్కడికి వచ్చిన జంటల వీడియోలను సీక్రెట్ గా తీసుకొని పొరన్ సైట్స్ లో అప్లోడ్ చేసిన ఘటనలు జరిగాయి ఇప్పుడు ఓ మైనర్ బాలిక పై Oyo రూమ్ లో అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది

మాయ మాటలతో మైనర్బాలికను ఓయో లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన యువకుడితోపాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు.గోల్కొండ తకత్బౌలి ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళ ఈనెల 14న గోల్కొండ పోలీస్స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంట్లో అంతకుముందు రోజు తన 15 ఏళ్ల కూతురు రాత్రి 7గంటల సమయంలో ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లిందని పేర్కొంది. భర్తతో కలిసి ఎంత వెతికినా కూతురి ఆచూకీ లభించలేదని తెలిపింది. కాగా, 16వ తేదీ తెల్లవారుజాము 3గంటల సమయంలో చోటాబజార్ప్రాంత నివాసి, వృత్తిరీత్యా బైక్మెకానిక్అయిన సయ్యద్నజీరుద్దీన్ఎలియాస్షోయబ్(20) తన కూతురికి బైక్పై తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలిపెట్టి పరారయ్యాడని తెలిపింది.

ఈ క్రమంలో పోలీసులు బాధితురాలిని విచారించగా వృత్తిరీత్యా ఎలక్ర్టీషియన్ అయిన తకత్బౌలి నివాసి సయ్యద్అబ్దుల్నదీమ్(23) తనను నజీరుద్దీన్ బైక్‌పై నెక్నాంపూర్‌లోని ఓయో లాడ్జీకి పిలిపించుకుని అక్కడ తనపై అత్యాచారం చేసినట్టుగా వెల్లడించింది. ఈ క్రమంలో గోల్కొండ పోలీసులు అబ్దుల్నదీమ్, నజీరుద్దీన్‌లపై ఐపీసీ 363, 376(3) రెడ్విత్109, పోక్సో యాక్ట్సెక్షన్5 రెడ్విత్6, 17 ప్రకారం కేసులు నమోదు చేశారు. వీరితోపాటు లాడ్జీలో వీరికి గది అద్దెకు ఇచ్చిన ఓయో లాడ్జీ రిసెప్షనిస్ట్జాన్సింగ్(23), లాడ్జీ యజమాని ముంతా విజయ్విజయ్(30)లను కూడా కేసులో నిందితులుగా చేర్చారు. నిందితుల్లో అబ్దుల్నదీమ్, షోయబ్‌లను ఈనెల 14న అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం జాన్సింగ్, విజయ్‌లను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular