spot_img
Monday, September 29, 2025
spot_img

ఓ కానిస్టేబుల్ కొడుకు వేల కోట్లకు ఎలా పడగలెత్తాడు..? గాలి జనార్ధన్ రెడ్డి కంత్రి కహానీ

పుట్టుకతో శ్రీమంతుడు కాదు, ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా మొదలు పెట్టిన ఆయన ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఆయన తండ్రి చిత్తూరు జిల్లా నుంచి బళ్లారికి వలస వచ్చారు. గాలి జనార్ధన్ రెడ్డి కోల్‌కతాలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీలు విక్రయించడంతో వ్యాపార ప్రయాణం మొదలెట్టాడు. తరువాత చిట్‌ఫండ్ కంపెనీ ప్రారంభించి అది అక్రమాలకు పాల్పడటంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలతో మూసేశారు. ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్ వ్యాపారాలు తడబడిన తరువాత, అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైనింగ్ కంపెనీను స్థాపించి ఇనుము గనుల తవ్వకాలు మొదలెట్టాడు.

ఈ కంపెనీ ఆయనను దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మైనింగ్ వ్యాపారవేత్తగా నిలబెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో గాలి జనార్ధన్ రెడ్డి మైన్ లైసెన్సులు పొందాడు. మైనింగ్ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బుతో బీజేపీలో చేరాడు. 1999లో సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ పోటీ సమయంలో, గాలి జనార్ధన్ రెడ్డి సుష్మా స్వరాజ్ కు మద్దతు ఇచ్చారు. ఈ సమయంలోనే ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి గణనీయమైన రాజకీయ ప్రభావం చూపించిన వ్యక్తి.

సీబీఐ, ఈడీ ఆయన ఆస్తులను జప్తు చేసిన తర్వాత కూడా ఆయన కుమార్తె వివాహం దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా నిర్వహించారు. తన కుమారుడిని హీరోగా పెట్టి సినిమాలు తీస్తున్నారు. 2024 మార్చి 25న, తన సొంత పార్టీని బీజేపీలో విలీనం చేసుకుని, మళ్లీ బీజేపీలో చేరారు. బళ్లారి జిల్లాలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి, కర్ణాటక రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపించారు. ఆయన జీవితం, వ్యాపారాలు, రాజకీయ ప్రయాణం కొంతమంది వ్యక్తులకు ప్రేరణగా కూడా వుంది. గాలి జనార్ధన్ రెడ్డి ప్రయాణం ఒక సాధారణ కుటుంబం నుండి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైనింగ్ వ్యాపారవేత్తగా ఎదగడం, ఆపై రాజకీయాలలో కీలక పాత్ర పోషించడం అత్యంత ఆసక్తికరమైనది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular