ఏదైనా దాడి జరుగుతున్నప్పుడు భదితునికి సహాయ పడకపోయినా…జరుగుతున్న ఘటనను వీడియో తీస్తున్న ఘటనలు చూశాం.. ఎదైన దారుణం జరిగినప్పుడు అక్కడే ఉన్న వాళ్ళు స్పందిస్తే కొంత మేరకు బాధితుడు రక్షించ బడతారు అన్న దానికి ఈ ఘటనే ఉదాహరణ..
ఓ వ్యక్తిపై కాల్పులకు పాల్పడిన దుండగులను చీపురు కర్రతోనే తరిమికొట్టిందో మహిళ. ఈ క్రమంలో తనవైపూ తూటాలు దూసుకొచ్చినా వెరవలేదు..దాంతో ఆ దుడగులు పారిపోయారు..
ఈ సంఘటన హరియాణా (Haryana)లో ఈ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధం ఉన్నట్లు భావిస్తోన్న హరికిషన్.. ఓ హత్య కేసులో నిందితుడు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. భివానీలోని ఇంటి బయట నిల్చోని ఉండగా.. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఒక్కసారిగా అతడిపై తుపాకులతో కాల్పులకు దిగారు.
కాల్పులు చేస్తున్న దుండగులు నుండి తప్పించుకుని, ఇంట్లోకి పారిపోయాడు. అప్పటికే నాలుగు బుల్లెట్లు తగలడంతో గాయాలపాలయ్యాడు. అయినప్పటికీ.. గేటు వద్ద నుంచి దుండగులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. అంతలోనే అక్కడికి వచ్చిన ఓ మహిళ.. తన వద్ద ఉన్న పొడవైన చీపురుతో వారిని తరిమింది. ఈ క్రమంలోనే తప్పించుకు పారిపోతూ.. ఓ వ్యక్తి ఆమె వైపూ కాల్పులు జరిపాడు. కానీ, ఆమెకు గాయాలేమీ కాలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. గాయాలపాలైన హరికిషన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసినట్లు చెప్పారు.