

బస్ స్టాప్‌లు, ఆటో స్టాండ్‌ల వద్ద రోడ్డుపై వెళ్తున్న యువతులు, మహిళల ఫోటోలు రహస్యంగా తీసి, వాటిని డీప్‌ఫేక్/అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్న వ్యక్తిని స్థానిక యువకులు పట్టుకున్నారు.
🔴 ఏం జరిగింది?
నిందితుడు రోజూ ఇదే పని చేస్తుండటాన్ని గమనించిన స్థానిక యువకులు అనుమానంతో వాడి ఫోన్ పరిశీలించగా
వందల సంఖ్యలో మార్ఫ్ చేసిన ఫోటోలు బయటపడ్డాయి.
“Friends Group” పేరిట ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అనేక మంది కలిసి ఈ అక్రమ కంటెంట్‌ను షేర్ చేస్తున్నట్టు గుర్తించారు.
ఆ గ్రూప్‌లో హండ్రెడ్స్ ఆఫ్ ఫోటోలు ఉన్నట్టు యువకులు వెల్లడించారు.
📞 సహాయం కోసం ప్రయత్నం – స్పందన లేదు?
ఘటనపై వెంటనే 100 డయల్ చేసినా,
అలాగే She Teams కు ఫోన్ చేసినా సరైన స్పందన రాలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
⚠️ ఇది తీవ్రమైన నేరం
మహిళల ఫోటోలు అనుమతి లేకుండా తీసి, మార్ఫింగ్ చేసి షేర్ చేయడం ఐటీ చట్టం, మహిళా భద్రతా చట్టాల ప్రకారం ఘోర నేరం. ఇలాంటి చర్యలు బాధితుల గౌరవం, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా సమాజంలో భయాందోళనలు సృష్టిస్తాయి.
🛑 కోబ్రా న్యూస్ డిమాండ్
నిందితుడితో పాటు గ్రూప్‌లో ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి
మహిళల భద్రతకు బాధ్యత వహించే విభాగాలు తక్షణ స్పందన చూపాలి
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరంతర నిఘా & అవగాహన అవసరం
👉 మహిళల భద్రతపై రాజీ లేదు. న్యాయం జరగే వరకు కోబ్రా న్యూస్ ఈ అంశాన్ని అనుసరిస్తుంది.



