spot_img
Monday, March 23, 2026
spot_img

కోబ్రా న్యూస్ EXCLUSIVE  హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాలో కొత్త షాక్… సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే సరఫరాదారులా?

హైదరాబాద్ మహానగరం నెమ్మదిగా మత్తు కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతోందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చలికాలం ప్రారంభమైన నవంబర్ నుంచి జనవరి వరకు డ్రగ్స్ విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు పోలీసు వర్గాల అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటున్నా, డ్రగ్ పెడ్లర్లు కొత్త పద్ధతులతో రెచ్చిపోతుండటం ఆందోళనకరం.
తాజా లెక్కల ప్రకారం ఒక్క హైదరాబాద్‌లోనే 10 వేల మందికిపైగా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు అంచనా. ఇప్పటివరకు డ్రగ్స్ సరఫరా అంటే నైజీరియన్ గ్యాంగ్స్, అంతర్రాష్ట్ర ముఠాలే ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్నత చదువులు చదివి, మంచి హోదాలో ఉద్యోగాలు చేస్తున్నవారే డ్రగ్స్ విక్రయాల్లోకి దిగడం పోలీసులకే కాదు—సమాజానికీ షాక్ ఇచ్చే అంశంగా మారింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినే డ్రగ్స్ సరఫరాదారిగా?
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా ఎంత లోతుగా విస్తరించిందో చూపిస్తోంది. ఏపీ కాకినాడకు చెందిన సుస్మిత అనే యువతి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఇమ్మాన్యుయెల్‌తో కలిసి డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతూ చిక్కడపల్లి పోలీసులు వలలో చిక్కింది.
ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి
MDMA,
LSD బాటిల్స్,
OG Kush వంటి మత్తు పదార్థాలు
స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.4 లక్షలుగా అంచనా వేస్తున్నారు.
టెలీగ్రామ్ ద్వారా డ్రగ్ డీల్స్
ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు ట్రాక్ చేసే అవకాశముందని గ్రహించిన డ్రగ్ పెడ్లర్లు, తాజాగా టెలీగ్రామ్ యాప్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. కోడ్ భాష, సీక్రెట్ గ్రూప్స్‌తో డ్రగ్ డీల్స్ జరగడం దర్యాప్తులో వెలుగులోకి వస్తోంది.
పెరుగుతున్న ఆందోళన
ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న యువతే డ్రగ్స్ విక్రయాల్లో భాగస్వాములవడం—ఇది కేవలం చట్టపరమైన సమస్య మాత్రమే కాదు, సామాజిక సంక్షోభానికి సంకేతంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా ఇక గ్యాంగ్‌లకే పరిమితం కాకుండా, కార్పొరేట్ వర్గాల్లోకీ చొచ్చుకుపోతుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు బయటపడే అవకాశం ఉందని, డ్రగ్ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇది కోబ్రా న్యూస్ EXCLUSIVE.
డ్రగ్స్ మాఫియాపై మా నిఘా కొనసాగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular