ప్రేమ పేరిట హద్దులు దాటడం.. వేధింపులకు గురి చేయడం.. అఘాయిత్యాలకు పాల్పడటం నేరం. ఇప్పటి వరకు అమ్మాయిలపై అబ్బాయిలు వేధింపులకు పాల్పడటం చూశాం. కానీ ఓ యువతి రివర్స్‌లో తన ప్రియుడికి టార్చర్ చూపించింది. ఆమె వేధింపులు భరించలేని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో బుధవారం ఉదయం జరిగింది. మృతుడి బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
గాజువాకలోని శ్రీనివాసనగర్‌కు చెందిన కోసన్ భాస్కర్ రావు (బాబీ) స్థానికంగా ఉన్న ఏవీకే డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతడికి నీట్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి తిరిగారు. తాజాగా ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని భాస్కర్ రావు కోరింది. దానికి అతడు అంగీకరించలేదు. దీంతో తనను పెళ్లి చేసుకోకపోతే అట్రాసిటీ కేసు పెడతానని ఆ యువతి బెదిరించింది. భయపడిపోయిన భాస్కర్ రావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణంతో కన్నీరు మున్నీరు అయిన తల్లిదండ్రులు సదరు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకోవాలని తన కుమారుడిని టార్చర్ పెట్టిందని , ఆమె కోరిక తీర్చనందుకే బెదిరింపులకు పాల్పడిందని, భాస్కర్ రావు మృతికి ప్రియురాలే కారణమని గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోరిక తీర్చలేనన్నా కారణంగా ప్రియురాలి వేదింపులు..తట్టుకోలేక యువకుడు సూసైడ్
RELATED ARTICLES