spot_img
Tuesday, March 24, 2026
spot_img

గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్… ఫ్లాట్ లో అన్నతో పాటు అడ్డంగా బుక్!

డ్రగ్స్ తో పట్టుబడ్డ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్
తన అన్న సంపత్ కోసం వెళ్లిన పోలీసులకు గంజాయి తో పట్టు బడ్డ షణ్ముఖ్
ఓ యువతీ ని పెళ్లి చేసుకుంటా అని పదేళ్ళుగా మోసం చేస్తున్న సంపత్
ఆరు రోజుల్లో పెళ్లి.. అంతలోనే మరో యువతి తో వివాహం తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసిన మోనికసంపత్ వినయ్.. బిగ్ బాస్ ఫేం షణ్ముక్ అన్న సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు..ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో పట్టుబడ్డ షణ్ముక్ అన్నా తమ్ముడు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గంజాయి కేసులో షణ్ముఖ్ తో పాటు అతని అన్నయ్య సంపత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మౌనిక అనే యువతిని ప్రేమించిన సంపత్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మౌనిక మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. సంపత్ కోసం పోలీసులు ఇంటికి వెళ్లారు. ఫ్లాట్ లో షణ్ముఖ్, జస్వంత్ గంజాయి సేవిస్తూ కనిపించారు.

షాక్ అయిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వేర్వేరు కేసుల్లో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. గంజాయి మత్తులో ఉన్న షణ్ముఖ్ మౌనిక వీడియో తీస్తుంటే అడ్డుకున్నాడని సమాచారం. గతంలో షణ్ముఖ్ హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యాడు. 2021లో షణ్ముఖ్ వేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న వారిని గాయపరిచాడు. అలాగే వాహనాలు ధ్వంసం చేశాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో మద్యం సేవించలేదని తేలింది. తాజాగా షణ్ముఖ్ డ్రగ్స్ కేసులో బుక్ అయ్యాడు.

షణ్ముఖ్ యూట్యూబర్ గా పాప్యులర్ అయ్యాడు. ఆయన పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. షణ్ముఖ్ హీరోగా చేసిన వెబ్ సిరీస్ సాఫ్ట్ వేర్ డెవలపర్ అత్యంత ఆదరణ పొందింది. షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్ళాడు. టైటిల్ రేసులో నిలిచిన షణ్ముఖ్ తృటిలో చేజార్చుకున్నాడు. సన్నీ విన్నర్ కాగా, షణ్ముఖ్ రన్నర్ అయ్యాడు.

దీప్తి సునైనతో షణ్ముఖ్ చాలా కాలం రిలేషన్ లో ఉన్నాడు.  బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన షణ్ముఖ్ కి దీప్తి బ్రేకప్ చెప్పింది. హౌస్లో షణ్ముఖ్ కంటెస్టెంట్ సిరితో సన్నిహితంగా ఉన్నాడు. ఈ విషయంలో హర్ట్ అయిన దీప్తి విడిపోయిందనే వాదన ఉంది. నటుడిగా వెబ్ సిరీస్లలో ఆఫర్స్ దక్కించుకుంటున్న షణ్ముఖ్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular