ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ WinZO వ్యవస్థాపకులు అయిన సౌమ్య సింగ్ రాథోడ్, పవన్ నందా (Paavan Nanda) లను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ WinZO వ్యవస్థాపకులు గత కొంత కాలంగా.. మనీ లాండరింగ్ ఆరోపణల ఎందుర్కొంటున్నారు
గేమింగ్ ప్లాట్‌ఫామ్ WinZO కాపెనీ కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోధాలు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తగిన ఆధారాలు లభించిన తర్వాత.. వ్యవస్థాపకులు అయిన సౌమ్య సింగ్ రాథోడ్, పవన్ నందా (Paavan Nanda) లను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
WinZO, Gamezkraft సంస్థలపై దాడులు నిర్వహించిన ED, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్య తీసుకుంది.
వినియోగదారులు నిజమైన వ్యక్తులతో కాకుండా సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్స్‌తో ఆడుతున్నారనే వాస్తవాన్ని దాచిపెట్టి, WinZO ‘క్రిమినల్ కార్యకలాపాలు, అక్రమ పద్ధతుల్లో’ పాల్గొంటుందని ED కేసు నమోదు చేసింది.
గేమింగ్ యాప్ నిషేధం తర్వాత కూడా గేమర్లకు రూ. 43 కోట్లు తిరిగి చెల్లించకుండా సంస్థ నిలిపివేసిందని, అలాగే భారతదేశం నుండి బ్రెజిల్, యూఎస్ వంటి దేశాలలో రియల్-మనీ గేమ్స్‌ను ఆపరేట్ చేసిందని ED తెలిపింది.
గేమింగ్ యాప్ నిర్వాహకుల పై ఈడీ అధికారులు ఫోకస్..అన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ WinZO వ్యవస్థాపకులు అరెస్ట్
RELATED ARTICLES



