spot_img
Sunday, July 20, 2025
spot_img

గోదావరి కుర్రోడిని.. గోవాలో కర్రలతో కొట్టి చంపిన హోటల్ సిబ్బంది

న్యూఇయర్ ఎంజాయ్ చేయాలని స్నేహితులతో కలిసి గోవా వెళ్లిన యువకుడి జీవితం విషాదాంతం అయ్యింది. పశ్చిమ గోదావరికి చెందిన యువకుడు గోవాలో దారుణ హత్యకు గురయ్యాడు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంకు చెందిన బొల్లా రవితేజ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి గోవా ట్రిప్ కు వెళ్ళాడు. ఐదుగురు యువకులు, ముగ్గురు యువతులతో కూడిన మిత్ర బృందం ఓ హోటల్లో దిగారు.

రవితేజ, స్నేహితులు ఉన్న హోటల్ యజమాని కొడుకు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించగా.. యజమాని కొడుకుపై రవితేజ తిరగబడ్డడాని అతని స్నేహితులు తెలిపారు. హోటల్ యజమాని కొడుకుపై రవితేజ తిరగబడ్డ క్రమంలో హోటల్ సిబ్బంది అంతా ఏకమై కర్రలతో దాడికి పాల్పడగా, రవితేజకు తలకి తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడని తెలిపారు స్నేహితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహం తాడేపల్లిగూడెం చేరుకోవడంతో మృతుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలో ఇలాంటి ఘటన జరగటంతో రవితేజ కుటుంబంతో పాటు తాడేపల్లిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular