ఘోరమైన స్థితిలో యువతి మృతదేహం లభ్యమైన ఘటన జిన్నారం మండలం మంగంపేట గ్రామం పరిధిలో చోటుచేసుకుంది. మంగంపేట గ్రామ పరిధిలోని శివారు అడవి ప్రాంతంలో శనివారం ఉదయం 20 నుంచి 25 సంవత్సరాల మహిళ మృతి దేహం కనిపించింది
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని వివరాలను ఆరా తీస్తున్నారు. కాగా ఈ మహిళ మృతదేహాన్ని సగానికి పైగా వీధి కుక్కలు పీక్కు తిన్నాయి. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సింది.




