spot_img
Saturday, July 19, 2025
spot_img

చెప్పినట్లు వినకుంటే కూతురి ఖర్చులు తండ్రి భరించక్కర్లేదా..? అసలు కోర్టు ఏం చెప్పింది?

సోషల్ మీడియాలో ఒక వార్త సర్కులర్ అవుతుంది. దాని ప్రకారం తండ్రి చెప్పినట్లు వినకపోతే కుమార్తె చదువు, పెళ్లి వంటి ఖర్చులను భరించాల్సిన అవసరం లేదని గతంలో కోర్టు తీర్పును తప్పుగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి 2022లో ఒక కేసు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు, అక్కడి సందర్భానికి అనుగుణంగా ఇవ్వబడింది.

వివరాల్లోకి వెళితే ఒక విడాకుల కేసులో తమకు తండ్రితో ఎలాంటి సంబంధం వద్దని కూతురు తేల్చి చెప్పింది. ఈ సందర్భంలో కోర్టు తన తీర్పులో కూతురు పూర్తిగా సంబంధాన్ని తండ్రితో వద్దనుకుంటున్నందున ఆమె చదువు, పెళ్లి వంటి ఖర్చులను భరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వాస్తవానికి విడాకుల సమయంలో భర్త చెల్లించే భరణంలో భార్య జీవించటానికి, అలాగే ఆమెతో పాటు పిల్లల బాధ్యతలను చూసుకోవటానికి అయ్యే ఖర్చులను కోర్టు లెక్కిస్తుంటుంది. అయితే 2022 మార్చిలో విడాకుల కోసులో మాత్రం 18 ఏళ్ల కూతురు తండ్రితో పూర్తిగా సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకోవటంతో ఆమె ఖర్చులను తండ్రి భరించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.

కానీ ఈ తీర్పు ఈ కేసులో కూతురి నిర్ణయానికి అనుగుణంగా తీసుకోబడింది. ఇది అన్ని కేసులకు అలాగే వార్తించదు. హిందూ వారసత్వ చట్టం, 2005 ప్రకారం తండ్రి ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆయన ఆస్తిలో కొడుకులతో సమానంగా కూతుళ్లకు కూడా వాటా ఉంటుంది. అంటే ఇక్కడ తండ్రి మాట వినని కూతురికి ఆయన ఆస్తి నుంచి చిల్లిగవ్వకూడా రాదు, ఆమె ఖర్చులను మేజర్ అయినందున తండ్రి భరించడు అన్న వార్తల్లో ఎలాంటి నిజం, లేదా చట్టపరమైన నిబంధనలు లేవు.

జరిగింది ఇది..
2022 విడాకుల కేసు సమయంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ బెంచ్ కుమార్తె 20 ఏళ్ల వయస్సు దాటి ఉండటంతో ఆమెకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉన్నట్లు పేర్కొంది. అక్కడ కేసులో కుమార్తె తండ్రితో ఉన్న అన్ని సంబంధాలను తెచ్చుకోవాలని నిర్ణయించుకోవటం వల్ల ఆయన నుంచి చదువు, ఇతర అవసరాలకు డబ్బును డిమాండ్ చేయలేదని కోర్టు పేర్కొంది. అయితే, తల్లికి శాశ్వత భరణంగా చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు, తల్లి కోరుకుంటే తన కూతురిని పోషించడానికి నిధులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోర్టు పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular