పోలీస్ ఉద్యోగం చేస్తూ తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని… కోట్లు గడించాలని గంజాయి స్మగ్లింగ్ చేస్తూ టాస్క్ ఫోర్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది
వివరాలలోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తూ భూపాలపల్లి పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించే క్రమంలో గంజాయి ఎక్కడి నుండి తీసుకుని వస్తున్నారని పోలీసులు ప్రశ్నించడంతో వారు సారపాకకు సంబంధించిన ఒక వ్యక్తి పేరు చెప్పారు. దీంతో భూపాలపల్లి పోలీసులు సారపాకకు చేరుకొని ఆ వ్యక్తిని పోలీస్ స్టైల్ లో విచారించగా భద్రాచలం పోలీస్ స్టేషన్లో పనిచేసే రమేష్ అనే కానిస్టేబుల్ గంజాయి సరఫరా చేస్తాడని,
తాను ఇతరులకు విక్రయస్తానని తెలిపాడు. వెంటనే భూపాలపల్లి నుండి వచ్చిన పోలీసులు అతని ఫోన్ నుండి గంజాయి అర్జెంట్‌గా కావాలని రమేష్ కు ఫోన్ చేయించారు. ఎప్పుడు జరిగే వ్యాపారం కావడంతో కానిస్టేబుల్ రమేష్ గంజాయి తీసుకుని సారపాక లోని సదరు వ్యక్తి వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న భూపాలపల్లి పోలీసులు రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి కానిస్టేబుల్ రమేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఈ విషయం పై సీఐ ను ఫోన్ లో వివరణ కోరెందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు




