spot_img
Tuesday, March 24, 2026
spot_img

జానీ మాస్టర్ పై రాయదుర్గం లో కేసు నమోదు, తన పై పలుమార్లు అత్యాచారం చేసారని ఒక యువతి (కొరియాగ్రాఫర్ )పిర్యాదు

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు మరియు నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.

ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతనిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జాని మాస్టర్‌కు గతంలో సైతం నేర చరిత్ర కలిగి ఉంది.. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

అయితే జాని మాస్టర్ ఇటీవలే రాజకీయాల్లో చేరి జనసేన తరపున ప్రచారం చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular