spot_img
Monday, July 21, 2025
spot_img

జీసస్ 12 మంది శిష్యులు ఏమయ్యారు.. ఎలా చనిపోయారో తెలుసా… వాళ్లలో ఒకరు ఇండియాలోనే

ప్రపంచం మొత్తం ఈస్టర్ ఘనంగా జరుపుకుంటోంది. శిలువ పై చనిపోయిన జీసస్ తిరిగి లేచిన రోజుగా క్రిస్టియన్స్ నమ్మే రోజుది. ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాక ఆయన శిష్యులు ఏమయ్యారు..

వారు ఎలా చనిపోయారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. బైబిల్ ల్లోను దానికి సంబంధించిన పూర్తి వివరాలు లేవు. కానీ క్రిస్టియన్ సంప్రదాయం, పరిశోధకుల ప్రకారం వారేమయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం.

ఒకరు తప్ప అందరూ హత్య చేయబడిన వారే

జీసస్ 12 శిష్యుల్లో చివర్లో ఆయనకు ద్రోహం చేసింది.. ఆయనను రోమన్స్ కు / యూదు చాంధసవాదులకు పట్టించింది ‘యూదా ఇస్కరియోతు’. అయితే తన తప్పు తెలుసుకుని జీసస్ ను వదిలేయాలని కోరగా యూదు యాజకులు ఒప్పుకోలేదు. చేసేదిలేక పశ్చాత్తాపంతో జీసస్ పట్టించినందుకు వచ్చిన డబ్బుతో కొన్న పొలం లోనే చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు యూదా ఇస్కరియోతు. జీసస్ ని సిలువ వేశాక యూదా స్థానంలో మరొకరి కోసం చీటీలు వేసి “మత్తియాస్”ని 12 శిష్యుడుగా ఎన్నుకున్నారు మిగిలిన వాళ్ళు.

1) జేమ్స్ ది గ్రేటర్
జీసస్ 12 మంది శిష్యుల్లో మొట్టమొదటిగా హత్య చేయబడింది జేమ్స్ ది గ్రేటర్. జీసస్ తల్లి మేరీ చెల్లెలు కొడుకు ఇతను. క్రిస్టియనిటీని ప్రచారం చేస్తున్నందుకు 44లో జెరూసలేం లో కింగ్ హేరోద్ ఇతనిని శిరచ్చేధం చేయించినట్టు బైబిల్ లో రికార్డ్ అయి ఉంది. ఇతని రెలిక్స్ ( మృతదేహం అవశేషాలు) తరువాతి కాలం లో స్పెయిన్ కీ తరలించి అక్కడ చర్చ్ కట్టారు.

2) పీటర్.

జీసస్ ప్రధానమైన శిష్యుడు పీటర్. సెయింట్ పీటర్ గా ప్రసిద్ధి కెక్కిన ఇతడ్ని క్రిస్టియానిటీకి మొట్టమొదటి పోప్ గా పరిగణిస్తారు. 64AD లో రూమ్ నగరం చాలావరకు అగ్నిలో తగలబడిపోయింది. ఈ అగ్నికి కారణం క్రిస్టియన్స్ అంటూ రోమ్ చక్రవర్తి నీరో చాలామందిని చంపించాడు. అందులో భాగంగా పెయింట్ పీటర్ ను కూడా (64-68AD మధ్య కాలం లో) సిలువ వేయించాడు. అయితే తను జీసెస్ అంత గొప్ప వాడిని కాదని తనను తలకిందులుగా సిలువవేయాలని పీటర్ అడగడంతో రోమన్స్ అలాగే చేశారు. వాటికన్ సిటీలోని సెయింట్ బేసిలికా చర్చ్ ని సెయింట్ పీటర్ సమాధిపైనే నిర్మించారు.

3) జాన్ (ది సన్ అఫ్ జెభిదీ )

ఇతను జేమ్స్ దె గ్రేటర్ తమ్ముడు. జీసస్ శిష్యుల్లో వృద్ధాప్యం వరకు ఉండి సహజంగా చనిపోయిన (98-100AD లో) వ్యక్తి ఇతను ఒక్కడే. క్రిస్టియానిటీని ప్రచారం చేస్తున్నందుకు గ్రీస్ దేశంలోని పట్మోస్ ద్వీపానికి ఒంటరిగా ఉండేలా పంపించేశారు. అతను అక్కడే బైబిల్ లోని చిట్టచివరి గ్రంథం అయిన “ప్రకటన”(బుక్ అఫ్ రెవిలేషన్) రాసినట్టు చెబుతారు. అలాగే బైబిల్ లో జీసస్ జీవిత చరిత్ర ఉన్న 4 గాస్పెల్స్ లో “గాస్పెల్ అఫ్ జాన్ ” సహా “ఎపిస్టల్స్ అఫ్ జాన్ ” పేరుతో ఉన్న మరో మూడు పుస్తకాలు కూడా రాసింది జాన్ అనే క్రిస్టియన్స్ నమ్ముతారు.

4) ఆండ్ర్యూ

పైన చెప్పిన ముగ్గురూ జీసస్ ప్రధాన శిష్యులుగా పేరుపొందారు. అయితే జీసస్ మొట్టమొదటిసారిగా తనకు శిష్యుడుగా ఉండమని పిలిచింది మాత్రం “ఆండ్ర్యూ” ని. క్రిస్టియానిటీని ప్రచారం చేస్తున్నందుకు గ్రీక్ సిటీ పెట్రోస్ లో 60 AD లో “X ” ఆకారం లో ఉన్న సిలువ పై వేలాడదీశారు. అయితే కాళ్లు చేతులకు మేకులు కొట్టకుండా తాళ్ళతో బంధించారు. అతను శిలువపై మూడు రోజులు బతికున్నాడని.. అంతసేపు క్రీస్తు బోధనలు ప్రకటిస్తూనే ఉన్నాడని చెబుతారు

5) ఫిలిప్

ఇతని గురించి తెలిసింది తక్కువే. కానీ జీసస్ శిష్యుల్లో గ్రీకు భాష తెలిసినవాడుగా చెబుతారు. టర్కీలోని “హైరోపోలీస్” పట్టణం లో గ్రీకు గవర్నర్ భార్యను క్రిస్టియానిటీలోకి మార్చినందుకు ఆ గవర్నర్ ఫిలిప్ తో పాటు మరో శిష్యుడు “బర్తలోమై” ను (54AD ) లో తలకిందులుగా శిలువ వేసినట్టు చెబుతారు. అయితే “బర్త లోమై ” ని మాత్రం తరువాత వదిలేసినట్టు ప్రచారం లో ఉంది..మరికొన్ని అకౌంట్స్ ప్రకారం ఫిలిప్ ని రాళ్ల తో కొట్టి తల నరికి చంపినట్టు భావిస్తారు.

6) బర్త లోమై (నాతానియెల్)

బైబిల్ లో “బర్త లోమై ” గురించి చాలా తక్కువ రాసి ఉంది. కానీ జీసస్ శిష్యుల్లో అత్యంత భయంకరమైన చావు ఇతనిదే అని చెబుతారు. అర్మేనియాలో ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడి రాజు (69 లేదా 71 AD లో )బతికుండగానే
“బర్త లోమై ” చర్మాన్ని ఒలిపించాడని.. తర్వాత తల నరికి చంపారని క్రిస్టియన్ సంప్రదాయంలో ఉంది. మరికొంత సిలువ వేసి చంపారని చెబుతారు. బర్త లోమై కొంతకాలం పాటు భారతదేశంలోని ‘కళ్యాణ్’ (ముంబై సమీపంలో ) నగరం లోనూ ప్రచారం చేసిన్నట్టు కొందరు క్రైస్తవ బోధకులు చెబుతారు. ఏదేమైనా చారిత్రకంగా ఇతని గురించి తెలిసింది మాత్రం చాలా తక్కువ.

7) మాత్యు (లేవీ)

ఇతను ఒక టాక్స్ కలెక్టర్. తర్వాత కాలంలో జీసస్ కు శిష్యుడు గా మారాడు. బైబిల్ లోని & గాస్పెల్ అఫ్ మాత్యు ‘ (మత్తయి సువార్త) ఇతనే రాసినట్టు చెబుతారు.కొందరు క్రిస్టియన్ స్కాలర్స్ దీనిని ఒప్పుకోరు. అలాగే ఇతని చావు గురించి కూడా చాలా భిన్న వాదనలు ఉన్నాయి . కొందరి ఇతన్ని పొడిచి చంపినట్టు, కొందరు నిప్పులో కాల్చి చంపినట్టు, తల నరికి చంపినట్టు రాకరకాల కథనాలు ఉన్నాయి. 68AD లో ఇతియోపియా లేదా పర్షియా (ఇరాన్) లో మ్యాత్యూ చనిపోయాడని ఎక్కువ మంది నమ్ముతారు.

8) సెయింట్ థామస్

క్రిస్టియానిటీ ప్రచారం చేస్తూ ఇండియా కీ వచ్చిన సెయింట్ థామస్ ని 72 AD లో చెన్నైలోని మైలాపూర్ వద్ద స్థానికులు ఈటె తో పొడిచి చంపారని క్రిస్టియన్ చరిత్రకారులు చెబుతారు. చెన్నైలోని మైలాపూర్ వద్ద ఉన్న మౌంట్ థామస్ కొండ పై థామస్ సమాధి ఉంది. 16 వ శతాబ్దం లో పోర్చుగీసు వాళ్ళు ఇక్కడ చర్చిని కట్టారు.19 శాతాబ్దం లో బ్రిటిష్ వాళ్ళు దీన్ని రీ మోడల్ చేశారు. 232 AD లో థామస్ ఆస్థికల్లో కొన్నిటిని టర్కీ లోని ఎడెస్సా కు తీసుకొని అక్కడ కూడా ఒక చర్చ్ కట్టారు.

9) జేమ్స్ ది లెస్

బైబిల్లో గుర్తించడానికి బాగా కన్ఫ్యూషన్ కి గురి చేసే పేరు జేమ్స్ . జీసస్ బతికున్న రోజుల్లో జేమ్స్ అనేది చాలా కామన్ పేరు. ఆల్రెడీ జీసస్ పిన్ని కుమారుడు జేమ్స్ ది గ్రేటర్ ఉండగా మరో జేమ్స్ కూడా ఏసు శిష్యుల్లో ఉన్నాడు. ఇతన్ని జేమ్స్ ది లెస్ గా పిలుస్తారు. ఇతడి మరణం పై కూడా రెండు కథనాలు ఉన్నాయి. 62AD లో యూదుల దేవాలయం పైనుండి కిందకి పడేసినట్టు.. అప్పటికి చావకపోవడంతో గద లాంటి ఆయుధంతో తలపై పై కొట్టి చంపేసినట్టు క్రిస్టియన్ సంప్రదాయం ఉండగా.. మరికొందరు ఈజిప్టులో మత ప్రచారం చేస్తుండగా చంపేసినట్టు నమ్ముతారు.

10) జూడా తాడియస్ (యూదా )

ఏసు ముఖ్యమైన శిష్యుల్లో యూదా ఒకడు. 65AD లో బేరుట్ ( ప్రస్తుత లెబనాన్ ) లో ప్రచారం చేస్తుండగా గొడ్డలితో నరికి చంపారని ఒక కథనం. అయితే ఇతని గురించిన పూర్తి వివరాలు బైబిల్ లో దొరకవు.

11) సైమన్ ది జీలట్

సైమన్ పేరు ఎక్కువగా జూడా తో కలిసి వినిపిస్తుంది. ఇద్దరు కలిసే ప్రచారం చేసేవారు. మధ్యలో కొంతకాలం సైమన్ ఈజిప్ట్, పర్షియా ల్లో ప్రచారం చేసి మళ్లీ జూడా తో కలిసి బేరూట్ లో ప్రచారం కోసం వెళ్ళాడు. అక్కడే జూడా తో కలిపి సైమన్ ను కూడా రోమన్స్ చంపేశారు అనేది క్రిస్టియన్ సంప్రదాయం.

12) మతియాస్

జీసస్ కు ద్రోహం చేసిన జూడా ఇస్కరియోత్ స్థానంలో శిష్యుల్లోకి తీసుకోబడిన ” మతియాస్” 80AD లో జీసస్ బోధనలు ప్రచారం చేస్తూ జెరూసలేం లోనే చంపబడ్డాడు. అక్కడి యూదులు అతన్ని రాళ్లతో కొట్టి చంపేసినట్టు ప్రచారంలో ఉంది. మరి కొంతమంది ఇథియోపియోలోని మాంసభక్షకులు సంచరించే ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ చంపబడ్డాడని అంటారు.
మొత్తం మీద జీసస్ శిష్యులకు సంబంధించిన వివరాలు ఏవీ బైబిల్ లో పూర్తిగా దొరకవు. అయితే వాళ్లలో “జాన్ ది అపోస్టల్ తప్ప ” మిగిలిన వాళ్ళందరూ హత్య చేయబడ్డారు అనే ఆధారాలు ఉన్నట్టు క్రిస్టియన్ పరిశోధకులు చెబుతుంటారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular