బిజీ లైఫ్ లో ఇంట్లో వండుకునే సమయం లేకపోవడం టెక్నాలజీ అప్డేట్ అవ్వడం తో రెస్టారెంట్ నుంచి ఇంటి వద్దకే ఫుడ్ వచ్చి చేరుతోంది. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయిఇందుకోసం భారీగా డెలివరీ ఫీజులను యూజర్ల ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే అవి GST విభాగం ఆగ్రహానికి గురయ్యాయి.
ఆన్ లైన్ ఫుడ్ అగ్రిగేటర్స్ స్విగ్గీ, జొమాటోలు చెరో 500 కోట్ల మేర GST నోటీసులు అందుకున్నాయి. వినియోగదారులకు ఫుడ్ డెలివరీ చేసేందుకు కస్టమర్ల నుంచి ఫీజులు వసూలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే ఆయా కంపెనీలు మాత్రం దీన్ని చెల్లించేందుకు అంగీకరించే పరిస్థితిలో లేవని సమాచారం.
.స్విగ్గీ, జొమాటోలు మొదలుపెట్టినప్పటి నుంచి సేకరించిన డెలివరీ ఛార్జీలపై నిబంధనల ప్రకారం GST విభాగం 18 శాతం పన్నుగా విధించినట్లు అర్థమవుతోంది. అవికాస్తా ఇరు కంపెనీల నుంచి కలిపి 1000 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తేల్చారు. ఈ మొత్తాన్ని రాబట్టేందుకు అధికారులు ఇప్పుడు నోటీసులు పంపించారు.
వినియోగదారుల నుంచి తాము కలెక్ట్ చేస్తున్న ఫీజును డెలివరీ ఏజెంట్లకే ఇస్తున్నామని స్విగ్గీ, జొమాటోలు వాదిస్తున్నాయి. అయితే పన్ను అధికారులు వారితో ఏకీభవించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా వసూలు చేస్తున్న రుసుముల ద్వారా ఫుడ్ అగ్రిగేటర్లు తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నట్లు వారు భావిస్తున్నారని తెలుస్తోంది.