1) 2016లో టానిక్ సంస్థ కోసం ఒక చీకటి జీవో తీసుకొచ్చారని.. వైన్ డీలర్స్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పైలెట్ ప్రాజెక్టు కింద టానిక్ సంస్థకు అనుమతులు ఇచ్చారు..
2) రాష్ట్రంలో కేవలం టానిక్ సంస్థకు మాత్రమే 13.6% టాక్స్ కట్టకుండా వెసులుబాటు కల్పించారు
3)అప్పటి ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కలిసి.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు
4) ఒక్క టానిక్ సంస్థ కు ఐదు సంవత్సరాల పాటు ‘టాక్స్ ఫ్రీ’తో పాటు 18 డిపోల నుంచి వైన్‌ను దిగుమతి చేసుకునేలా సౌకర్యం
5)ఏడేళ్లుగా టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వంద కోట్ల కైన రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు సమాచారం
6) ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మినెంట్ లైసెన్స్‌ను 2016లో ప్రత్యేక జీవో 271ను పేరిట జారీ చేసింది గత ప్రభుత్వం.
7) తెలంగాణ లో ఒక్క ఎలైట్ ఔట్ లెట్‌కు మాత్రమే అనుమతి
8)హైదరాబాదు, నగర శివారుల్లో మరో 10 ఎలైట్ వైన్ షాపులను
9) ‘Q By టానిక్’ పేరుతో నిర్వహిస్తూ వస్తోంది. నిబంధనల ప్రకారం.. ఎలైట్ వైన్స్ లైసెన్స్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశమే లేదు అయిన ఎవ్వరూ పట్టించుకోలేదు
10) ఈ లైనెస్స్ ప్రకారం లిక్కర్‌ను బాటిల్స్‌గా మాత్రమే విక్రయించాలి. లూజ్ వైన్‌కు అనుమతి లేదు. ఇతర పానీయాలు ,ఆహార పదార్ధాల అమ్మకానికి వీలులేదు.
11) సాధారణ మద్యం లైసెన్స్ అనుమతులు తీసుకుని విదేశీ మద్యం అమ్మకాలు జరపడం ఇక్కడ కొసమెరుపు. రీటైల్‌గా ఫారెన్ లిక్కర్ తోపాటు ప్రీమియం ఇండియన్ లిక్కర్ అమ్మడానికి టానిక్‌కు మాత్రమే వెసలుబాటు కల్పించారు.
12) టానిక్ వైన్ మార్టులో పని చేసే ఉద్యోగుల పేరిట లైసెన్సులు తీసుకున్నారు. అంతేకాదు.. ఈ ఫ్రాచైజీల్లో బడా బాబుల పిల్లల పెట్టుబడులు పెట్టారు.
13) ఓ ఐఏఎస్ అధికారితో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు సహకరించినట్లు ఎక్సైజ్ శాఖ ఇప్పటికే గుర్తించింది.
14) గచ్చిబౌలి, బోడుప్పల్, మాదాపూర్‌లో ఏర్పాటైన టానిక్ మార్టులో ఈ ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది