తమిళనాడుకు సంబంధించిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ( AR Murugadoss) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడు రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఇతను….తమిళ్, తెలుగు అలాగే హిందీలో వచ్చిన చాలా సినిమాలకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాకు కూడా ఆయన రైటర్ గా పనిచేశారు. ఇలా చాలా మంది బడా హీరోలతో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు ఏ ఆర్ మురుగదాస్.
అయితే అలాంటి మురుగదాస్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన దర్శకులే గొప్పవారన్న రేంజ్ లో స్పీచ్ ఇచ్చారు. చాలా మంది దర్శకులు 1000 కోట్ల సినిమాలు తీశారని గుర్తు చేస్తూ… వాళ్లు కేవలం జనాలను కనువిందు చేసేందుకు మాత్రమే సినిమాలు తీశారని చురకలు అంటించారు మురగదాస్.
కానీ తమ తమిళ దర్శకులు మాత్రం ఏ సినిమా తీసినా.. ప్రజలను ప్రభావితం చేస్తారని వెల్లడించారు. సామాజిక కోణంలో సినిమాలు చేస్తామని.. జనాలకు జ్ఞానం పెంపొందించేలా తీస్తామంటూ వ్యాఖ్యానించారు. మిగతా దర్శకులు ఎవరు కూడా జనాల కోసం ఆలోచించ బోరని టాలీవుడ్ దర్శకులకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక దీనిపై టాలీవుడ్ ప్రముఖులు ఫైర్ అవుతున్నారు.
టాలీవుడ్ ను అవమానించిన మురుగదాస్… మా వాళ్లే తోపులా అంటూన్నాడు
RELATED ARTICLES