spot_img
Sunday, July 20, 2025
spot_img

డబ్బులొస్తాయని యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తున్నారా?అయితే మిరు అడ్డంగా బుక్ అయినట్టే..

పండుగ వచ్చింది అంటే ఒకప్పుడు గ్రీటింగ్స్ తో విషెష్ కానీ ఇప్పుడు ఆ కాలం పోయింది ఇప్పుడు అంత ఆన్లైన్ విడియో లు కలర్ ఫుల్ గ్రీటింగ్ కార్డ్ లు పండుగకు గ్రీటింగ్స్ పంపినట్లుగా వినియోగదారుల వాట్సాప్ మెసేజ్ లు చేస్తున్నారు. ఆ గ్రీటింగ్స్ సులభంగా డబ్బు సంపాదించే ట్రిక్స్ అంటూ కొన్ని లింక్స్ ఇస్తున్నారు. అందులో టాప్ బ్రాండ్ల ప్రమోషనల్ వీడియోల లింక్స్ ఇచ్చి, వాటిని జస్ట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఇస్తామంటూ ఎరవేసి బట్టులో వేసుకుంటున్నారు. ఈ తరహా మోసాలు దీపావళి సందర్భంగా కొన్ని చోట్ల వెలుగుచూశాయి. ఈ తరహా మోసాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

మీరు ఖాళీ గా ఉన్నారా వీడియోలు చూస్తూ. వీడియో లను లైక్ చేస్తే డబ్బులు వస్తాయి అని ప్రకటనలతో లింక్ లు పంపి ఎట్రాక్ట్ చేస్తున్నరు..సైబర్ క్రైమ్ నేరస్తులు ఈజీ గా డబ్బులు వస్తున్నాయ్ కదా ఎదైన చేద్దాం పోయేదేముంది అందులో వర్క్ from internet mobail ల్లో గర్ల్ ఫ్రెండ్స్ తో సరసాలు అడుతు సరదాగా డబ్బు సంపాదించి కోవచ్చు అన్న ఆలోచన ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ పాలిట వరం గా మారిందిది ఎలా జరుగుతుందో తెలుసుకుందామా అయితే డీటైల్స్ చదవండి

ఇటీవలి ఓ వ్యక్తికి ఒక తెలియని నంబర్ నుంచి దీపావళి పండుగ శుభాకాంక్షలతో కూడని మెసేజ్ ఫోన్ కి వచ్చింది. అది పంపిన వ్యక్తి తనను తాను ప్రముఖ కంపెనీ నుంచి హెచ్ఆర్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. అతని కంపెనీ యూట్యూబ్ ప్రకటనలపై పని చేస్తుందని, మీకు డబ్బు సంపాదించడంలో సహాయపడే చిన్న టాస్క్ జాబ్‌లను అందజేస్తుందని చెప్పాడు. ఆ వ్యక్తి యూట్యూబ్ వీడియోలను చూడటం, లైక్ చేయడం ద్వారా రోజుకు రూ. 3000 వరకు ఆఫర్ చేస్తున్నట్లు వివరించాడు. దీని కోసం యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న మూడు వీడియో ప్రకటనలను లైక్ చేసి, ఆపై లైక్‌ల స్క్రీన్‌షాట్‌లను పంపాలని కోరాడు. ఆ తర్వాత డబ్బును పంపడానికి వినియోగదారుడి బ్యాంకు డిటైల్స్ షేర్ చేయాలని అడుగుతాడు.ఆ వ్యక్తికి వచ్చిన యూ ట్యూబ్ లింక్ లు సరైనవా కావా అని తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. ఆ యూ ట్యూబ్ వీడియోలు అన్ని సక్రమమైనవే. అధికారిక యూ ట్యూబ్ చానళ్ల నుంచి వచ్చినవే. అవి ప్రపంచ వ్యాప్తంగా పేరున్న టాప్ కంపెనీలకు సంబంధించినవే. డవ్, సంతూర్ వంటి కంపెనీలకు చెందిన యాడ్స్ అవి. స్కామర్ ఇది నిజమైన నమ్మక మైన ఆఫర్ అని నమ్మించి, వినియోగదారులను బురిడి కొట్టించేందుకు ఒరిజనల్ యూట్యూబ్ లింకులను వినియోగిస్తున్నాడు సైబర్ క్రిమినల్

ఈ స్కామ్ ఫిషింగ్ ప్రయత్నం కూడా కాదు. ఫిషింగ్ స్కామ్ అంటే స్కామర్‌లు హానికరమైన లింక్‌లను ఉపయోగించి మొబైల్ , కంప్యూట్ లని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ఈ స్కామ్‌లలో, ఆన్‌లైన్ మోసగాళ్ళు మొదట్లో శుభాకాంక్షలు, నిజమైన వీడియోలు పంపి వారు నిజం అని నమ్మిన తరువాత, ప్రజలను మోసగిస్తున్నారు. తర్వాత వారు బ్యాంకు వివరాలను తీసుకోవడం ద్వారా సైబర్ క్రిమినల్స్ పక్కా స్కెచ్ అమలు చేస్తున్నారు. ముందుగా కొంత డబ్బును పంపుతూ బాగా నమ్మంచి న తర్వాత టోకరా వేసి భారీ ఎత్తున డబ్బులు గుంజు తున్నారు వినియోగదారుడు తనకు వచ్చినడబ్బును కావాలి అని అడిగినప్పుడుస్కామర్‌లు పన్ను, ఇతర చట్టపరమైన సమస్యలు ఉన్నాయి అని వారిని బెదిరించి, టాస్క్‌ల నుండి సంపాదించిన నిధులను యాక్సెస్ చేయడానికి ఎక్కువ చెల్లించేలా చేస్తారు. కొన్ని సందర్భాల్లో, స్కామర్‌లు మనీలాండరింగ్ ఆరోపణలతో బాధితుడిని బెదిరించడం వల్ల బాధితులు స్కామర్‌ల ఖాతాలలో ఎక్కువ డబ్బు జమ చేస్తారు.అవి మనకు చేరవు అయా లింకిల్లోనకు వచ్చినట్టు కనిపిస్తాయి కానీ ఆ డబ్బులను డ్రా చేసుకోలేము..ఎలా డిజిటల్ మని నీ ఆన్లైన్ లో చూపించి డబ్బులు గుంజుతున్నరు.

వాట్సప్ ద్వారా లింక్ లు పంపుతున్న సైబర్ క్రిమినల్స్

మనం సైబర్ క్రిమినల్స్ భారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

1) మీకు తెలిసిన వ్యక్తుల నుంచి స్నేహితుల అభ్యర్థనలు లేదా సందేశాలను మాత్రమే అంగీకరించండి.

2)ఫోన్ కాల్ లేదా మరొక మెసేజింగ్ యాప్ వంటి ఇతర మార్గాల ద్వారా మిమ్మల్ని సంప్రదించే వ్యక్తి గుర్తింపును తెలుసుకోండి.
3)తెలియని లేదా ఊహించని మూలాల నుంచి లింక్‌లపై క్లిక్ చేయడం లేదా జోడింపులను డౌన్‌లోడ్ చేయడం మానుకోండి.
4) బహుమతులు, డబ్బు లేదా అవకాశాల గురించి వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
5) మీ వాట్సాప్ ఖాతాలో టూ స్టెప్ వెరిఫికేషన్ ను ఎనేబుల్ చేసుకోండి.

6) మీ ఫోన్ నంబర్‌కు అదనంగా పిన్ అవసరం చేయడం ద్వారా మి మొబైల్ సెక్యూరిటీ ఉంటుంది
7) మీకు లేటెస్ట్ సెక్యూర్టీ ప్యాచ్‌లు, ఫీచర్‌లు ఉన్నాయని తెలుసు కోవడానికి మీ వాట్సాప్ యాప్‌ని తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి.

8)మీ ప్రొఫైల్ సమాచారం, నవీకరణలు, చివరిగా చూసిన వివరాలను ఎవరు కూడా కుండా మీ ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చుకోండి


9) షోషల్ మీడియాలోతెలియని పరిచయాలతో లేదా తెలియని వెబ్‌సైట్‌ల ద్వారా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చెయ్యవద్దు


10) ఏవైనా అనుమానాస్పద లింక్ లు వాట్సాప్ కి వస్తె స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి.. స్కామర్‌లపై తగిన చర్య తీసుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది.

11) సైబర్ నేరగాళ్లు ఉపయోగించే తాజా స్కామ్‌లు, లింక్ లు ఎప్పటి కప్పుడు అప్ డేటెడ్ గా ఉండండి.

సాధారణ స్కామ్‌ల గురించి తెలుసుకోవడం మీరు వాటిని గుర్తించి సేకూర్రుంగా ఉండటానికి సహాయపడుతుంది. అదనంగా, స్కామ్‌ల గురించి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మోసాలను అరికట్టాలంటే అవగాహన తప్పనిసరి.

మీరు ఎలాంటి సైబర్ నేరస్తుల భారిన పడ్డ సైబర్ క్రైమ్ పోలిస్ లకింగాని..సైబర్ హెల్ప్స్ కి (NGO) తెలపండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular